Link copied!
Sign in / Sign up
191
Shares

మీ పిల్లలకు ఈ 4 ఆహారాలు చాలా ప్రమాదకరం: అస్సలు తినిపించకండి

 

మీ పిల్లలకు ఈ 10 ప్రమాదకరమైన ఆహారాలు తినిపిస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి. పిల్లలు ఎదుగుతున్న కొద్ది వారికిచ్చే ఆహారంలో కొత్తవి చేర్చుతుంటాం.  అలా చేయడం పిల్లలకు మంచిదని అనుకుంటాం. కానీ మీరు పిల్లలకు కొత్తగా తినిపిస్తున్న ఆహారాలలో చాలా ప్రమాదకరమైనవి ఉండచ్చు. మొదటి సంవత్సరం దాటని మీ పిల్లలకు ఎట్టిపరిస్థితిలో తినిపించకూడని ప్రమాదకరమైన 10 ఆహారాలు ఇవే...

1.తేనె

క్లోస్ట్రిడియం బోటులినుం అనే పరాన్నజీవి జీర్ణవాహికలో బీజాలను ఏర్పరచి, తీవ్రమైన అజీర్తి సమస్యలను కలిగిస్తుంది. ఈ ప్రమాదకరమైన జీవి తేనెలో ఎక్కువగా వుండే అవకాశముంది. పెద్దవారిలోని అన్నవాహిక ఈ బీజాలను నివారిస్తుంది. కాని  పిల్లలలో బీజాలు పెరిగిపోతాయి. ప్రమాదకరమైన కొన్ని రకాల టాక్సిన్స్ ని ఉత్పత్తి చేస్తాయి. అందుకె తేనె చిన్నపిల్లలకు ఇవ్వకూడదు. మొదటి సంవత్సరం దాటాక తినిపించచ్చు.

2.గుడ్లలో తెల్ల సొనా

కొంతమంది పిల్లలకు గుడ్లు ఆరోగ్యకరం అనుకుంటారు. కానీ గుడ్లలోని తెల్ల సొనా పిల్లలలో సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ (salmonella infection) కు కారణమవుతుంది. దీని కారణంగా అతిసార వ్యాధులు వస్తాయి. గుడ్లను మొదటి సంవత్సరం పూర్తయ్యేంతవరకు తినిపించకపోవడం మంచిది.

3. పచ్చి కూరగాయలు

క్యారెట్, బీట్ రూట్, దోసకాయ లాంటి గట్టిగా వుండే కూరగాయ ముక్కలను పళ్ళు రాని పిల్లలకు ఇవ్వకూడదు. వాళ్ళు నమల లేరు కాబట్టి మింగడానికి ప్రయత్నించినప్పుడు గొంతులో అడ్డు పడే ప్రమాదం వుంది. వాటిని తినిపించాలి అనుకుంటే మెత్తగా ఉడక పెట్టి చిన్న ముక్కలుగా తినిపించాలి. వీటిని 6నెలలు వయసు దాటాకా తినిపించచ్చు

4. చేపలు

చేపలు లేదా ఇతర సీఫుడ్ కొన్ని అలర్జీలను కలిగిస్తాయి. చేపల లో ముల్లులు గొంతులో గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటిని కొంత వయసు వచ్చే వరకు పిల్లలకు తినిపించకపోవడం మంచిది.

5. చక్కర

పిల్లలకు చక్కర లేదా చక్కర తో కూడిన తీపి పదార్ధాలు తీనిపించడం ఎప్పుడు మంచిది కాదు. చక్కర వలన పళ్ళు పుచ్చిపోతాయ్ లేదా జలుబు చేయచ్చు. పిల్లలకు తీపివి ఏదైనా తినిపించాలి అనుకుంటే కొన్ని రకాల పండ్లు తినిపించడం మంచిది.

6.చిక్కటి పాలు

పిల్లలకు కాల్షియమ్ కోసం పాలు చాలా  అవసరం అని అందరికి తెలిసిన విషయమే. కానీ చిక్కని పాలలో వుండె అధిక మినరల్స్, ప్రోటీన్స్, సోడియం పిల్లలకు అరగకుండా అజీర్తిని గలిగిస్తాయి. పాలు,పెరుగు, మజ్జిగా  లాంటివి పల్చగా చేసి ఇవ్వడం మంచిది

7.సిట్రిక్ పండ్లు

నిమ్మ కాయలు, ఆరెంజ్స్, ఫైనాపిల్ లాంటి పండ్లు పిల్లలకు మంచిది కాదు. ఈ పండ్లు అలెర్జీలు కలిగించక పోయిన పిల్లలుకు రాషెస్ వచ్చేలా చేస్తాయి. టమాటో సిట్రిక్ కాకపోయినా అదికూడా తినిపించకూడదు, అజీర్తికి కారణం అవుతుంది.

8.గింజలు

గింజలు, పచ్చిపప్పులు లేదా జీడిపప్పు, బాదాం, పిస్తా లాంటి డ్రై ఫ్రూప్ట్స్ పిల్లలకు అజీర్తి సమస్యని కలిగిస్తాయి. వీటిని పిల్లలు నమల లేరు, గొంతులో అడ్డు పడే ప్రమాదం వుంది. వీటిని పిల్లలు పూర్తిగా నమల కలిగె దశలో ఉన్నపుడు తినిపించాలి.

9.చాక్లెట్

కొంత మంది పిల్లలకు చాక్లేట్లు, కాండీస్ తినడానికి ఇస్తారు. ఇది చాలా ప్రమాదకరం.  చాక్లేట్స్ లో కోకోవా పిల్లలకు అల్లర్జీస్ కలిగిస్తుంది. 2-3 సంవత్సరాలు దాటేంతవరకు పిల్లలకు చాక్లేట్లు తినిపించకూడదు.

10. స్ట్రా బెర్రీస్

ఈ మధ్య చాలా మంది పిల్లలకు మార్కెట్ లో దొరుకుతున్న  బెర్రీస్ లాంటివి పండ్లకు బదులు తినిపిస్తున్నారు. వీటిలో పిల్లలకు అరగని పదార్ధాలు ఉంటాయి. కడుపునొప్పి, అజీర్తిని కలిగించచ్చు. మొదటి సంవత్సరం తరువాత తినిపించచ్చు. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon