Link copied!
Sign in / Sign up
11
Shares

పిల్లలకు డబ్బా పాలు పట్టిస్తున్నారా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన 3 జాగ్రత్తలు

వాస్తవానికి తల్లి పాలను మించిన ఆహరం లేదు. అయినప్పటికీ కొన్ని సార్లు ఫార్ములా (డబ్బా పాలు) పాలు ఇవ్వాల్సి రావచ్చు. ఆధునిక సూత్రాలు గల ఈ పాలు కూడా మంచివే. మీరు తల్లి పాలను భర్తీ చేయాలి అని అనుకుంటే మీ చిన్నారికి 3 నుంచి 4 వరాల వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి. కానీ ఎంత ఫార్ములా మిల్క్ ఇవ్వాలి? ఒకవేళ తక్కువ ఇస్తున్నామా? ఎక్కువ ఇస్తున్నామా? అని ఆలోచనలు రావడం సహజమే. దీనికి సమాధానం, మీ చిన్నారి ఎదుగుదల మరియు బరువుని పరిశీలిస్తే తెలుస్తుంది. సాధారణంగా, పసి పిల్లలు వారికి ఆకలి వేసినప్పుడు పాలు తాగుతారు, కడుపు నిండగానే ఆపేస్తారు. కానీ, ఆకలి వేరు వేరు పిల్లలకి వేరేలా ఉంటుంది, అవి మారుతూ ఉంటాయి కూడా.

1. ఫార్ములా మిల్క్ యొక్క రకాలు

మీ బిడ్డ యొక్క పోషకాహార అవసరాలను తీర్చడానికి శిశు సూత్రాలు తయారు చేసారు, అవి మోడల్ చేయబడిన రొమ్ము పాలు వంటివి. దాదాపు అన్ని ఫార్ములా మిల్క్ కొంచెం మార్చిన ఆవు పాలను కలిగి ఉంటాయి. డాక్టర్ని సంప్రదించి ఐరన్ కలిగి ఉన్న ఫార్ములా మిల్క్ని కొనుక్కోండి.

2. ఎంత ఫార్ములా అవసరం?

ఎక్కువ శాతం మంది పిల్లలు ప్రతి కొన్ని గంటలకు ఆహారం కోరుకుంటారు. మొదటి వారంలో, అవసరమైనప్పుడు మాత్రమే మీ చిన్నారికి ఫార్ములా మిల్క్ ఇవ్వండి. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారికి మనం ఎక్కువ ఫీడ్ చేయకూడదు. వారి చిట్టి శరీరం జీర్ణించుకోగల్గినంత చేస్తే చాలు. మొదట్లో 1 లేదా 2 ఔంసుల ఫార్ములా మిల్క్ ఇస్తే చాలు. పెరిగే కొద్దీ చిన్నారి రోజుకి ఒక బాటిల్ తాగగలడు. ఒక నెల నిండే సరికి తాను 24 ఔంసుల పాలు తాగగలడు. 2డవ నేలలో 24 నుండి 32 ఔంసులు, 4 నుంచి 6 విడతల్లో తీసుకోగలడు. 6 నెలలు నిండే సరికి 32 నుండి 40 ఔంసులు తాగగలడు. మొదటి సంవత్సరం వరకు ఇలానే కొనసాగుతుంది. 6 నెలలు దాటిన తరువాత పాలతో పాటు ఘణ పదార్థం ఇవ్వడం కూడా మొదలు పెట్టండి.

3. మీ చిన్నారికి తగినంత పోషకం లభిస్తుందా లేదా అని తెలుసుకోవడం ఎలా?

మీ చిన్నారి మొదటి రెండు వారాల్లో బరువు పెరిగి, అది క్రమంగా పెరుగుతూ ఉంటె మీ చిన్నారికి కావాల్సిన పోషకాలు లభిస్తున్నట్టు.

రోజుకి 5 నుండి 6 డైపర్లు తడిపేస్తుంటే లేదా 6 నుండి 8 గుడ్డతో తయారు చేసిన డైపర్లు పాడు చేస్తుంటే మీ చిన్నారికి సరైన పోషణ లభిస్తున్నట్టు అర్థం.

చివరగా, మీ చిన్నారి ఫీడింగ్ తరువాత హాయిగా, తృప్తిగా కనిపిస్తే, మీ చిన్నారికి ఎటువంటి పోషణ సమస్య లేదు అని అర్థం చేసుకోవచ్చు.

4. గుర్తుపెట్టుకోవల్సిన కొన్ని విషయాలు

పోసిషన్: పాలు పట్టించే సమయంలో బేబీ తల కొంచెం పైకి ఉండేలా చూసుకొని, బాటిల్ని కొంచెం పైకి ఎట్టి పాలు తాగించాలి. ఇలా చేయడం ద్వారా చిన్నారి ఎక్కువ గాలి మింగేయదు.

డైపర్స్ ని తరచూ చెక్ చేస్తూ ఉండండి: మీ చిన్నారి మాములు కంటే తక్కువ డైపర్లు పాడుచేస్తుంటే డాక్టర్ని సంప్రదించండి.

బాటిల్ నిప్ప్ల్ రంద్రం మరీ పెద్దగా లేకుండా చుకోండి: రంద్రం పెద్దగా ఉంటె, చిన్నారికి నోరు తొందరగా నిండిపోయి పాలు తాగడానికి ఇబ్బందిపడచ్చు. మీ చిన్నారి ఎలా పాలు తాగుతున్నాడో గమనించి, రంద్రం పెద్దగా ఉందా, చిన్నగా ఉందా అని గుర్తించి సరి చేయండి. 

.....................................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon