Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లలకు బలవంతంగా తినిపించడం వలన ఎదురయ్యే 5 ఇబ్బందులు.. ప్రతి తల్లి తప్పక తెలుసుకోవాలి

తల్లిగా మీకు కావాల్సింది, మీ పిల్లలు అన్ని ఆహారాలు తిని బలంగా ఆరోగ్యంగా ఉండడం. కానీ మనం అనుకున్నది అంత సులువుగా జరగదు కదా.  అందరు పిల్లలు ఒకలా ఉండరు. మీరు ఇచ్చే ఆహారాన్ని అసలు తినరు. ఇక మీకు మిగిలిన మార్గం మీ పిల్లలకు ఆహారాన్ని బలవంతంగా తినిపించడం. అలా చేస్తే మీ బిడ్డకు ఆహరం అందుతుంది కానీ అందులో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి…

1. జీవితాంతం ఇక నచ్చదు

మీరు మీ పిల్లలకు ఇష్టం లేని ఆహారాన్ని బలవంతంగా తినిపిస్తే, అందులోని పోషకాలు వారికీ అంది వాళ్ళు బలంగా ఉంటారని మీరు భావిస్తారు. కానీ అల జరగడానికి బదులు మీ పిల్లలు మీరు బలవంతంగా తినిపించే ఆహారం మీద అసహ్యాన్ని పెంచుకుంటారు. జీవితాంతం ఆ ఆహరం తినకపోయే ప్రమాదం వుంది.

2. తక్కువ తింటారు

మీరు మీ పిల్లలకు బలవంతంగా తినిపించడం వలన వారు ఆహరం మీద విరక్తిని పెంచుకుంటారు. భవిష్యత్తులో తక్కువ ఆహరం మాత్రమే తింటారు.

3. ఊబకాయం

పిల్లలకు చిన్న వయసులో బలవంతంగా తినిపించడం వలన వారు పెద్ద అయ్యాక అనేక రోగాలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బలవంతంగా తినిపించడం వలన పిల్లలకు పెద్దయ్యాక ఊబకాయం వచ్చే ప్రమాదం వుంది.

4. అడ్డుపడుతుంది

చాలా మంది పిల్లలు తినని మారం చేస్తే బలవంతంగా ఆహారాన్ని నోట్లోకి కుక్కుతారు. ఇది చాలా చాలా ప్రమాదం. పిల్లలకు ఆహరం ఇలా తినిపించడం వలన గొంతులో అడ్డు పడే ప్రమాదం వుంది.

5. కక్కుంటారు

ఇది ఇంకో ప్రమాదం, పిల్లలకు బలవంతంగా ఆహరం తినిపించడం వలన వాళ్ళు ఆహరం తినిన ప్రతి సారి ఆహారాన్ని బయటకు కక్కేస్తారు. అంతే కాకుండా ఇది వారు సాధారణంగా ఆహరం తినిన సమయంలో కూడా జరగచ్చు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon