Link copied!
Sign in / Sign up
46
Shares

పిల్లలకు బలాన్ని ఇచ్చే 'గోధుమ లడ్డులు' 10 నిముషాల్లో తయారు చేయడం ఎలాగో తెలుసుకోండి

పిల్లలకు ఎప్పుడు ఒకే రకమైన ఆహారాన్ని కాకుండా వారికి ఏమంటే ఇష్టం, ఎటువంటి ఆహారాలను బాగా ఇష్టపడతారో ప్రతి తల్లి తప్పక తెలుసుకోవాలి.  ముఖ్యంగా చిన్న వయస్సు నుండే పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ ఉండటం వలన వారిలో రోగ  నిరోధక శక్తి పెరిగి బలంగా, దృఢంగా ఉండగలరు.  అలా పిల్లలకు ఇష్టమైన వాటిలో గోధుమ లడ్డులు ఒకటి. ఇందుకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

గోధుమ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు

1. 2 కప్పుల తాజా గోధుమ పిండి

2. ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా బెల్లం

3. అర కప్పు తాజా నెయ్యి

4. కాజు లేదా బాదం

గోధుమ లడ్డు తయారు విధానం

➤ ముందుగా గోధుమ పిండిని పెనం లేదా బౌల్ లోకి తీసుకుని చిన్న మంటపై లైట్ డార్క్ కలర్ (ముదురు రంగు) వచ్చేలా వేడి చేసుకోవాలి. ఎటువంటి నూనె లేదా నెయ్యి అవసరం లేదు.

➤ గోధుమ పిండి వేడి చేసిన తర్వాత గ్రైండర్ లేదా మిక్సిలో గోధుమ పిండి మరియు బెల్లం కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

➤ గ్రైండ్ అయిన పిండిలో నెయ్యి కలపడం చేయాలి. నెయ్యి కలపడం వలన పిండి అవుతుంది కాబట్టి, ఆ తర్వాత లడ్డులలుగా చేతితో చేసుకోవాలి. కావాలంటే కాస్త నెయ్యిని లడ్డుకు రాసుకోవచ్చు. దీంతో గోధుమ లడ్డులు రెడీ అయినట్లే.

➤ఆ లడ్డులపై డ్రై ఫ్రూట్స్ అయినటువంటి కాజు లేదా బాదంలను అందంగా పెట్టడం వలన పిల్లలు ఇష్టంగా తింటారు.

గోధుమ లడ్డుల వలన కలిగే ఉపయోగాలు

గోధుమలలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది మరియు శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తుంది. చక్కరకు బదులుగా బెల్లం ఉపయోగించడం వలన ఐరన్ బాగా అందుతుంది. వీటిని ప్రతి రోజూ పిల్లలకు స్నాక్స్ టైంలో ఇస్తే ఇష్టంగా తినవచ్చు.   ఇందులో బెల్లం ఉండటం వలన పెద్దలు కూడా తినవచ్చు.

10 నిముషాలలో తయారు చేసుకునే గోధుమ లడ్డుల తయారీ విధానం అందరికీ తెలిసేలా SHARE చేయండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon