Link copied!
Sign in / Sign up
57
Shares

పిల్లల సున్నితమైన చర్మం కోసం ప్రత్యేకమైన 5 సోపులు


మీ పిల్లలకు కావాల్సిన బట్టలు, బొమ్మలు, వస్తువులు తీసుకునేటప్పుడు, వాటి కలర్ నుంచి క్వాలిటీ వరకు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటారు.  కానీ మీ పిల్లలకు స్నానం చేయించడానికి ఎంచుకునే సోప్ గురించి ఎంత ఆలోచిస్తున్నారు? తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లల చర్మం మనలా కాదు. చాలా సున్నితం. ఏదో ఒక సోప్ వాడడం వాళ్ళ చర్మానికి హాని కలిగిస్తుంది. అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సోపులను మాత్రమే వాడాలి.  అలాంటి వాటిలో 5 బెస్ట్ సోప్స్…

1.వెలేదా క్యాలెండ్యులా సోప్
Weleda Calendula Soap

పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాటిలో ఈ సోప్ చాలా ఉత్తమమైనది. ఇందులో వాడే చామంతి నూనె, పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా సహజమైన మాయిశ్చరైజర్(moisturizer) గా కూడా పనిచేస్తుంది.

2.థీ హానెస్ట్ కంపెనీ బబుల్ బాత్
The Honest Company Bubble Bath

ఇది లోషన్ లా ఉంటుంది. నీళ్ళలో కలిపి పిల్లలకు స్నానం చేయించాలి. ఇందులో చామంతి, అలోవెరా, కొబ్బరి నూనె, జొజోబా ఉంటాయి. ఇవి పిల్లల చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో మూడు రకాలు అందుబాటులో ఉన్నాయి, డ్రీమి లావెండర్ (Dreamy Lavender), స్వీట్ ఆరంజ్ వెన్నిలా (Sweet Orange Vanilla), ఆప్రికాట్ కిస్ (Apricot Kiss).

3. హిమాలయ జెంటిల్ బేబీ సోప్
Himalaya Gentle Baby Soap

ఈ సోప్ పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడింది. ఇందులో సహజమైన తేన, పొద్దుతిరుగుడు పువ్వు(sunflower), పాలు లాంటి వాటిని వాడుతారు. ఈ సోప్ పిల్లల చర్మానికి ఎలాంటి దురద కాని, మంటగాని కలిగించదు.

4.అవీనో బేబీ వాష్ అండ్ షాంపూ
Aveeno Baby Wash and Shampoo

దీనిని షాంపూగా కూడా వాడచ్చు. ఇందులో పిల్లల కళ్ళకు ఏ విధమైన హాని, కలిగించని. నో టియర్ ఫార్ములా (no tear formula) వాడబడింది. ఇది చర్మం మీద మాత్రమే కాకుండా పిల్లల జుట్టు మీద కూడా పని చేస్తుంది.

5.ముస్తేల స్టలాటోపియా మిల్కీ బాత్ ఆయిల్
Mustela Stelatopia Milky Bath oil

మీ పిల్లలకు ఎక్జిమా (eczema) లాంటి చర్మ సంబంధిత వ్యాధులు కానీ,  చర్మం పొడిబారడం కానీ జరుగుతుంటే ఈ బాత్ ఆయిల్ వాడండి. ఇది పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిబారడం నుంచి రక్షిస్తుంది. మృదువుగా చేస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon