Link copied!
Sign in / Sign up
21
Shares

పిల్లల పెదాలపై ముద్దు పెడుతున్నారా..! ఒక్కసారి ఇది చూడండి, అసలేం జరుగుతుందో..

పిల్లలను ఇష్టపడని వారు ఎవరుంటారు. వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలని అందరికి ఉంటుంది.  వారి బుజ్జి చేతులను, చిన్న పాదాలను, బుల్లి బుగ్గలను ముద్దు పెట్టుకుంటాం. అంతవరకు ఏ సమస్య లేదు. కానీ పిల్లల పెదాల పై కూడా కొందరు ముద్దు పెడుతుంటారు. అలా చేయడం పిల్లలకు ప్రమాదం అందుకు కారణాలు ఇవే

1. ఫాటల్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్

ఈ మధ్య కొందరు పిల్లలు పుట్టిన నెలల వ్యవధిలోనే చనిపోతున్నారు అందుకు ఒక కారణం ఫాటల్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్. ఈ వైరస్ పిల్లలకు పెద్దల ద్వారా వ్యాపిస్తుంది. పెద్దలలో ఈ వైరస్ ప్రాణాంతకం కాదు, జలుబు దగ్గు కు కారణమవుతుంది. కానీ పిల్లలకు ఈ వైరస్ ప్రాణాంతకం. ఈ వైరస్ ఉన్న వాళ్ళు పిల్లలను పెదాల మీద ముద్దు పెట్టుకోవడం వలన పిల్లలకు ఈ వైరస్ సోకే అవకాశం ఉంది.

2. రోగ నిరోధక శక్తి

పిల్లలలో రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పూర్తి స్థాయిలో రూపొంది ఉండదు. తల్లి పాల ద్వారా అందే కొలొస్టరుమ్ యాంటీబాడీస్ అధికంగా ఉన్నా రోగ నిరోధక శక్తి పిల్లలలో బలంగా ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న వైరస్ కూడా వారికి ప్రాణాంతకం కావచ్చు. ముద్దుల ద్వారా అవి వ్యాపించవచ్చు.

3. ఫుడ్ అలెర్జిస్

కొన్ని రకాల ఆహారాలు పిల్లలకు అలెర్జిస్ కలిగించవచ్చు. పిల్లలు 6 నెలల వరకు తల్లి పాలు తప్ప మిగతా ఏ రకమైన ఆహారాల నుండైనా అలెర్జీలు గురి కావచ్చు. పెద్దలు పిల్లలను ముద్దు పెట్టుకునే ముందు ఏదైనా ఘాటైన ఆహరం తిని ఉంటే, దాని వలన పిల్లలకు అలెర్జీలు రావచ్చు. అందుకే పెదాల మీద ముద్దు పెట్టకపోవడం మంచిది.

4. కెమికల్ రియాక్షన్

పిల్లలను చూడడానికి వచ్చిన వారిలో ఎవరైనా మేక్ అప్ లేదా ఏదైనా ఘాటైన పెర్ఫ్యూమ్, పౌడర్ వాడుతుండవచ్చు. పిల్లలు చాలా సున్నితంగా ఉండడం వలన అవి వాడిన వారు పిల్లలను ముద్దు పెట్టుకున్నా అది వారికి ప్రమాదం కావచ్చు. అందుకే కాస్త జాగ్రత్తగా వుండడం మంచిది.

5. పొట్ట నొప్పి

పిల్లలను ముద్దు పెట్టుకోవడం వలన పెద్దల నుండి పిల్లలకు సోకే బాక్టీరియా నుండి పిల్లలకు చాలా ప్రమాదం. చర్మ సమస్యలే కాకుండా, బాక్టీరియా కడుపులోకి చేరే ప్రమాదం వుంది. కడుపులోకి చేరడం వలన జీర్ణ సమస్యలు లేదా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు పెదాల మీద ముద్దు పెట్టుకోనివ్వకండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon