Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లల పై జరుగుతున్న అత్యాచారాలు!! పిల్లలను రక్షించుకోడానికి ఇలా చేయండి


ప్రస్తుతం మనమున్న వాతావరణంలో చాలామంది హింస, అసహనం, అత్యాచారాలను ఎదుర్కొంటున్నారు. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో చూసి ఉండవచ్చు. కానీ మన పిల్లలకే ఇలాంటివి ఎదురైతే? ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు అత్యాచారాలకు గురయ్యే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి.

సర్వేలు ఎమీ  చెబుతున్నాయి ?

పిల్లలపై అత్యాచారాల గురించి అందరూ మాట్లాడుతున్నారే కానీ వాటిని ఎలా నిరోధించాలో ఎవరికీ తెలీదు. పిల్లలపై లైంగిక దాడి ఎంతో హేయమైన చర్య. ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 10 మందిలో ఒక మగాడు బాల్యంలో లైంగిక దాడికి గురైనట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. బాలబాలికల్లో కొందరు తమకు తెలిసిన పెద్దల వల్ల కానీ, తమ కంటే పెద్ద పిల్లల వల్ల కానీ అత్యాచారానికి గురవుతున్నట్టు తరచు వెల్లడవుతోంది. పది కేసులు నమోదైతే వాటిలో ఎనిమిది కేసుల్లో నేరస్థుడు బాధితుడికి తెలిసిన వాడే అవుతున్నాడు. పైగా పిల్లలు నమ్మి, ప్రేమించే వారే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏదోక ఆశ పెట్టో, నచ్చచెప్పో, బెదిరించో పిల్లల్ని లొంగదీసుకోవడమే ఎక్కువగా జరుగుతోంది. పిల్లల ప్రవర్తన ఎప్పటిలా కాకుండా విపరీతంగా ఉంటే ఏదో జరిగి ఉంటుందనేది తలిదండ్రులు తెలుసుకోవాలి. 

పిల్లలపై అత్యాచారం జరిగినట్టు ఈ కింది లక్షణాల వల్ల తెలుసుకోవచ్చు.

1. ఎవరైనా ఒక వ్యక్తిని చూసి కానీ, ఒక ప్రదేశాన్ని చూసి కానీ పిల్లలు విపరీతంగా భయపడుతున్నప్పుడు.

2. తమను ఎవరైనా తాకారా అని అడిగితే పిల్లలు ఊహించని రీతిలో స్పందించడం.

3. భౌతిక పరీక్షకు కారణం లేకుండానే భయపడడం.

4. నల్లని, ఎర్రని రంగులున్న కొన్ని డ్రాయింగ్స్ చూసి భయపడడం.

5. అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు రావడం.

6. జననావయవాలు, లైంగిక క్రియ గురించి వారిలో అకస్మాత్తుగా చైతన్యం కలగడం.

బాలలపై తరచు అత్యాచారాలు జరుగుతుండడంతో వాటిని నివారించే మార్గాలు ఆలోచించాలని సామాజిక వేత్తలు, సైకియాట్రిస్టులు పదేపదే చెబుతున్నారు. తమను తాము రక్షించుకోవడానికి పిల్లలకు తలిదండ్రులు ఎలాంటి సలహాలివ్వాలి? పిల్లల్ని తాకే హక్కు ఎవరికీ లేదని ఎందరు తలిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారు?

పిల్లల విషయంలో తలిదండ్రులు మేలుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకు తమ శరీరంపట్ల అవగాహన కలిగేవరకూ వాళ్లకు శిక్షణ ఇవ్వాలి. ఎవరు ఎలాంటివాళ్లో పిల్లలు గ్రహించేలా చేయాలి. పిల్లలు వివిధ వయసుల్లో వివిధ రకాలుగా అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉంది.

ఒక అంకుల్ రోజూ ఒక చిన్న పిల్లకు స్వీట్లు, గిఫ్ట్ లు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నాడంటే అనుమానించాల్సిందే. అలాంటి అనుమానం పిల్లల్లో కూడా కలిగేలా, తెలుసుకునేలా చేయాలి.

1. ఎవరో ముక్కూ మొహం తెలీని వారి దగ్గరకి పిల్లల్ని ఎందుకు పంపాలి?

2. పిల్లల గురించి, వారు ఆ రోజు స్కూల్లో ఏం చేశారు అన్నది తలిదండ్రులు తెలుసుకోవాలి.

3. ఇలాంటి పరిస్థితులు వస్తే కౌన్సిలింగ్ ఇచ్చే పిడియాట్రిషన్ ను సంప్రదించాలి. బాలల సంరక్షణ ఏజెన్సీని సంప్రదించాలి. మీ పిల్లల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లల వయసును బట్టి వాళ్ల శరీరావయవాల గురించి చెప్పాలి. మర్మావయవాల గురించి, సెక్స్ గురించి కూడా వారి చిన్నప్పుడే సంకోచం లేకుండా చెప్పాలి. పిల్లలు సంకోచం లేకుండా ప్రతి విషయం తలిదండ్రులకు చెప్పేలా వారిని తీర్చిదిద్దాలి. ఎవరు ఎలాంటివారో చెప్పాలి. దాదాపు పదేళ్ల వయసు వచ్చాక, తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియజేయాలి.

పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా వారికి ముందు నుంచే తలిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon