సాధారణంగా పిల్లల కడుపులో 85 శాతం పురుగులు ఉంటాయి : వాటిని బయటకు ఎలా తీయాలో తెలుసుకోండి..
చిన్న పిల్లల కడుపులో దాదాపు 85 శాతం పురుగులు ఉంటాయట. ఈ పురుగులనే నులి పురుగులు, బద్దె పురుగులు, సూది పురుగులు అని అంటారు. ఇవి చిన్న పిల్లల కడుపులో ఉండటం వలన బరువు తగ్గిపోయి అనారోగ్యానికి గురవవుతారు. అసలు ఈ పురుగులు రావడానికి కారణాలేంటి? వీటి నుండి ఎలా బయటపడాలో వివరంగా తెలుసుకోండి.
పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి కారణాలు
చిన్న పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి ప్రధాన కారణం నీరు మరియు ఆహారమే. కలుషితమైన నీరు తీసుకోవడం వలన, సరిగ్గా ఉడకని ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఆరు బయటే మల విసర్జన, కాళ్ళు, చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవడం, పిల్లలందరూ ఒకే చోట ఉండటం వలన ఒకరి నుండి మరికొకరి బాక్టీరియా సులువుగా వ్యాపించడం జరుగుతుంది.
పిల్లల కడుపులో పురుగులు - లక్షణాలు
కడుపు నొప్పి, తలనొప్పి. మలద్వారం చుట్టూ దురద మంట ఉండటం, వాంతులు, రాత్రి పూత సరైన నిద్ర కలగకపోవడం, చర్మంపై దద్దుర్లు, ఆకలి ఉన్నా తినలేకపోవడం, రోజురోజుకీ బక్కచిక్కి పోవడం, రక్తహీనత, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, రాత్రి నిద్రలో పళ్ళు కొరకడం, ముఖం పాలిపోవడం, మలం తర్వాత చిన్న చిన్న పురుగులు పడటం జరుగుతుంటుంది.
కడుపులో పురుగులు తగ్గడానికి ఏం చేయాలి?
వెల్లుల్లి రసం
వెల్లుల్లి మంచి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. అందుకని ప్రతి రోజూ చిన్న గ్లాస్ చొప్పున ముడి వెల్లుల్లి రసంలో కాస్త నీరు కలిపి ఇవ్వడం వలన ఈ ఎలాంటి పురుగులైనా సరే నశిస్తాయి.
మరిగించిన నీరు
పిల్లలకు ఎప్పుడూ నీరు ఇచ్చినా సరే మరిగించిన తర్వాత చల్లార్చి ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే బాక్టీరియా వారి శరీరంలోకి ప్రవేశించదు.
లవంగాల నీరు
రెండు లవంగాలు ఒక గ్లాస్ నీటిలో వేసి, ఆ నీటిని తాగించినా మంచి ఫలితం ఉంటుంది.
బొప్పాయి జ్యూస్
ఇది మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ లో ఒక స్పూన్ తేనే కలిపి ఇవ్వడం వలన పురుగులు అనేవి వారి కడుపు నుండి దూరమవుతాయి.
పాలు -పసుపు
ప్రతి రోజూ రెండు పూటలా ఒక గ్లాస్ పాలు ఇవ్వడం అందులో ఒక స్పూన్ పసుపు కలిపి పాలు తాగించడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారవుతారు.
చేతులు, మలద్వారం
మలద్వారం తర్వాత శుభ్రంగా కడగడం, చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, పండ్లు ఇచ్చేటప్పుడు శుభ్రంగా కడిగి ఇవ్వడం చేయాలి.
పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా లేకపోతే ఏ తల్లితండ్రులు సంతోషంగా ఉండలేరు కాబట్టి ప్రతి తల్లితండ్రులకు తెలిసేలా SHARE చేయండి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
పిల్లలలో ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడే ఆయుర్వేద ఆహార పదార్థాలు
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
