Link copied!
Sign in / Sign up
27
Shares

పిల్లలు కాయిన్స్ మింగినా, గొంతులో ఇరుక్కున్నా ఏం చేయాలి? వెంటనే తెలుసుకోండి, చాలా ప్రమాదం..

చిన్న పిల్లలు తమకు దగ్గరగా ఉండే చిన్న చిన్న వాస్తు వస్తువులను నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా కాయిన్స్ (నాణెములు), బటన్స్,  ఆడుకునే వస్తువులు, విత్తనాలు, ఇసుక, మట్టి..ఇలా ప్రతి ఒక్కటీ నోట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. పిల్లలు కాయిన్స్ మింగినా లేదా గొంతులో ఇరుకున్నా చాలా ప్రమాదం కాబట్టి వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి.

పిల్లలు కాయిన్స్ మింగారని ఎలా తెలుసుకోవాలి..?

పిల్లలు ఏదైనా వస్తువు నోట్లో పెట్టుకున్నప్పుడు లేదా వారి గొంతులో ఉన్నట్లయితే నోటి నుండి లాలాజలం కారుతూ ఉంటుంది.  గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, ఉన్నట్లుండి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మెడ, చెస్ట్ భాగాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, స్పృహ కోల్పోవడం జరుగుతుంది, వాంతులు అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీ పిల్లల నోట్లో ఏదో ఉందని వెంటనే గుర్తించాలి.

పిల్లలు కాయిన్స్ మింగితే ఏం చేయాలి..?

ఇది ప్రతి ఒక్క తల్లి తండ్రులను ఇబ్బందిపెడుతున్న సమస్యే కాబట్టి, పిల్లలు కాయిన్స్, బటన్స్ వంటివి నోట్లో పెట్టుకున్నప్పుడు వెంటనే ప్రాధమిక చికిత్సగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

*పిల్లల గొంతులో కాయిన్స్ ఇరుక్కున్నట్లు అనిపిస్తే ముందుగా వారికి తాగడానికి నీరు లేదా ఏదైనా డ్రింక్ ఇవ్వాలి.

*వాంతులు వచ్చేలా చేయాలి.

*పిల్లలకు ఎటువంటి నొప్పి లేకుండా, కాయిన్స్ గొంతులో లేవు అనిపిస్తే, పిల్లల మూత్రంలో కాయిన్స్ వచ్చాయేమో గమనించాలి. ఇలా రానట్లయితే అరటిపండు తినిపించాలి. నీటిని బాగా తాగనివ్వాలి.

*గొంతులో ఇరుక్కుపోకుండా కడుపులోకి కాయిన్స్ వచ్చినట్లయితే చాలా వరకు ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్స్ చెబుతున్నారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు.

*పిల్లలకు నొప్పిగా ఉండి, ఒకరోజు లేదా రెండు రోజులైనా కాయిన్స్ బయటకు రాకపోతే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళండి. ఎక్స్ రే తీసి కాయిన్స్ పొజిషన్ గుర్తించి, బయటకు వచ్చేలా నొప్పి లేకుండా మందులు ఇస్తారు.

ఇలా మాత్రం అస్సలు చేయకండి..

చిన్న పిల్లల దగ్గర కాయిన్స్, బటన్స్, బ్యాటరీలు, నోట్లో పెట్టుకునేందుకు వీలుగా ఉండే చిన్న చిన్న ఆట వస్తువులు, డ్రస్ లు కుట్టుకునే సూదులు అస్సలు ఉంచకండి. మీరూ నిర్లక్ష్యంగా వదిలేసినవే మీ పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి..

ఇది కూడా చదవండి..

పిల్లల గొంతులో ఆహారం ఇరుక్కుంటే ఏం చేయాలి?

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon