Link copied!
Sign in / Sign up
53
Shares

పిల్లల గొంతులో ఆహారం ఇరుక్కుంటే వెంటనే ఏం చేయాలి..? లేకపోతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం..

పిల్లల గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం, నాణెములు లేదా ఏదైనా చిన్న చిన్న వస్తువులు గొంతులో ఇరుక్కుపోయి  ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలా గొంతులో ఆహారం (దోసె ముక్క) ఇరుక్కుపోవడం వలన రీసెంట్ గా ఒక చిన్నారి ఊపిరి తీసుకోవడం కష్టమై ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.  అందుకని ఇక్కడ చెప్పుకునే విషయాలు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి..

పిల్లల గొంతులో ఆహారం ఇరుక్కుంటే

 

 

మనం తినిపించిన ఆహారమే కాకుండా తమకు అందినవి, దగ్గరున్న చిన్న చిన్న వస్తువులను నోట్లో పెట్టుకున్నప్పుడు  గొంతులో ఇరుక్కుపోయి గట్టిగా  అరుస్తుంటారు పిల్లలు. అటువంటప్పుడు మీరు వెంటనే ఒకే కుర్చీపై కూర్చొని పిల్లలను తల కిందకు ఉండేలా కాళ్ళపై బోర్లా పడుకోబెట్టాలి. ఆ తర్వాత వీపుపై నాలుగు సార్లు చరుస్తూ ఒత్తిడి తీసుకురావాలి. మీ కాళ్ళ ఒత్తిడి పిల్లల కడుపుపై ఉండటం వలన త్వరగా అడ్డుపడ్డ పదార్థం బయటకు వస్తుంది. అలాగే నడుం నుండి రెండు భుజాల  మధ్యగా పై వైపుకు కదిలిస్తే అడ్డుపడ్డ పదార్థం వెంటనే బయటకు వస్తుంది.

రెండవ పధ్ధతి

పిల్లల గొంతులో ఆహారం ఇరుక్కుంటే ముందుగా పిల్లలకు ఎడమ పక్కగా నిలబడి వీపుపై నాలుగు ఐదు సార్లు చిన్నగా కొట్టడం లేదా చరుస్తూ ఉండాలి. మరో చేత్తో పిల్లల ఛాతీపై ఒత్తిడి పెరిగేలా ఉంచి, పిల్లల తలను కిందకు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పిల్లల తలను కాస్త పైకి నోటి దవడలు తెరిచి చేతి వేళ్ళ సాయంతో ఇరుక్కున్న పదార్థాలను బయటకు తీయాలి. ఇలా చేస్తే సులభంగా గొంతులో ఇరుక్కుపోయిన పదార్థాలు బయటకు వస్తాయి.

పిల్లలను ఆపకండి

ఏదైనా పదార్థం గొంతులో ఇరుక్కున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడిపోతూ ఏడుస్తూ దగ్గటం చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వారిని ఆపకండి. ఇలా ఆపడం వలన భయంతో అలాగే ఉండిపోతారు. శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది.  పైన చెప్పినట్లు చేసినా ఆహార పదార్థాలు బయటకు రాకపోతే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి.

పిల్లల దగ్గర ఉంచకూడనివి

పిల్లల దగ్గర ఏవి ఉంచాలో, ఏవి ఉంచాలో మీకు బాగా తెలిసే ఉంటుంది. కానీ కాయిన్స్, పిన్నీసులు, నాణెములు, బెలూన్స్, పూసలు, గట్టిగా ఉండే విత్తనాలు, క్యారెట్, ఫ్రూట్స్ ముక్కలు, చాకోలెట్స్ వంటివి ఉంచకూడదు. చిన్న చిన్న ముక్కలుగా బాగా ఉడికిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం ఉత్తమం.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ SHARE చేయగలరు..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon