Link copied!
Sign in / Sign up
19
Shares

పిల్లల ఏడుపును 10 సెకన్లలో ఆపగలిగే టెక్నిక్ : కొత్తగా తల్లి అయిన వారికి ఇది చాలా అవసరం

పిల్లలు ఎప్పుడు, ఎందుకు ఏడుస్తారో తెలుసుకోవడం తల్లికి కూడా చాలా కష్టమైన పనే. ఏడుపు విషయంలో పసిపిల్లలు నోరు తెరచి ఇందుకే ఏడుస్తున్నాను అని చెప్పలేరు కాబట్టి తల్లే బిడ్డ గురించి తెలుసుకోవాలి. కొత్తగా తల్లి అయిన వారికి పిల్లల ఏడుపును ఎలా ఆపాలో, ఏం చేస్తారో ఆపుతారో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. పాలు ఇచ్చి ఆకలి తీర్చినా సరే బిడ్డ ఏడుస్తుంటే తల్లికి ఏడుపువస్తుంది. ప్రతి తల్లి బాధను అర్థం చేసుకుని ఈ ఆర్టికల్ అందిస్తున్నాం…

పాదాల కింద మసాజ్ చేయండి

పసిపిల్లలు తరచూ ఏడుస్తుంటే కాలి పాదాల కింద మధ్య భాగంలో సున్నితంగా మీ చేతులతో మర్దనా చేసినట్లయితే వెంటనే ఏడుపు ఆపేస్తారని ఆరోగ్య నిపుణులు మరియు చాలామంది తమ పిల్లలకు ఈ విధంగా చేసిన తల్లులు చెప్పిన మాటలు. కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్ ను మీరు ఫాలో అవ్వండి.

సాంగ్ లేదా మ్యూజిక్

మీరు ఎప్పుడైనా గమనించారా ఏదైనా మీకు నచ్చిన సాంగ్ లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు పిల్లలు ఒక్కసారిగా ఏడుపు ఆపివేయడం చేస్తుంటారు. అందుకని ఆ సాంగ్ లేదా మ్యూజిక్ మీరు వారు ఏడుస్తున్నప్పుడు పెట్టినట్లయితే సులభంగా ఏడుపు ఆపేస్తారు. నడిచే పిల్లలు ఐతే ఆ పాటే కావాలని మారాం చేస్తుంటారు కూడా..

శరీరం ఇబ్బందిగా ఉంటే ఏడుపు మొదలుపెడతారు

చాలామంది పిల్లలలో ఏడుపు కారణం ఆకలి, కడుపు నొప్పి, నిద్ర మాత్రమే కాదు. శరీరం ఇబ్బందిగా ఉన్నప్పుడు అంటే ఉక్కపోతగా ఉండటం లేదా చమట ఎక్కువగా వేయడం వలన, దురద మంట కలిగినప్పుడు వారు వెంటనే ఏడుపు మొదలు పెడతారు. అందుకని పిల్లలకు రోజూ రెండు సార్లు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించడం ఉత్తమం. ఆరు నెలల పసికందుకు రోజుకి రెండుసార్లు స్నానం అవసరం లేదంటున్నారు వైద్యులు.

ఇలా చేయండి

పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే బుజ్జగించడం, అటు ఇటు తిప్పడం, బయటకు తీసుకువెళ్లడం,అదిగో ఇదిగో అంటూ వస్తువులు లేదా పెద్దవాళ్ళను చూపించడం చేస్తుంటారు. అలాగే పిల్లల చెవులను మృదువుగా చేతులు లేదా ముక్కుతో తాకడం, కడుపుపై చేయి పెట్టి సున్నితంగా మర్దనా చేస్తున్నట్లయితే ఏడుపును ఆపేస్తారు.

ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon