Link copied!
Sign in / Sign up
43
Shares

పిల్లల చెవిలో పురుగులు, దుమ్ము ధూళిని నొప్పి లేకుండా 2 నిముషాల్లో ఎలా బయటకు తీయాలో చూడండి

చిన్న పిల్లలు చెవినొప్పితో బాధపడుతున్నప్పుడు వారిని అలానే వదిలివేయకండి. ఎందుకంటే నిద్రలో లేదా ఆడుకుంటున్నప్పుడు చెవిలోకి చీమలు, పురుగులు  చేరడం, చిన్న చిన్న రాళ్లు చెవిలోకి చాలా బాధకు గురి చేస్తుంటాయి. చెవి నొప్పిగా ఉందని చెప్పినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడం లేదా ఇక్కడ వీడియో ప్రకారం ఫాలో అవ్వండి..

చెవి నొప్పి ఉన్నప్పుడు ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వండి
ఉల్లిపాయ నుండి గుజ్జు

పిల్లలైనా పెద్దలైనాసరే చెవిపోటు లేదా చెవి నొప్పిగా ఉన్నప్పుడు చిన్న ఉల్లిపాయను తీసుకుని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చెవి నొప్పిగా ఉన్న చోట దగ్గరగా బయట ఉంచడం వలన చెవి నొప్పి ఉండదు.

వెల్లుల్లి వేయించి

చమురులో వెల్లుల్లిని రెండు రిబ్బలను తీసుకుని వేయించాలి. ఈ మిశ్రమాన్ని చెవి నొప్పిగా ఉన్నప్పుడే కాకుండా నెలకు ఒకసారి పిల్లల చెవిలో రెండు చుక్కలు వేసి కాటన్ ఉంచాలి. కొన్ని గంటల తర్వాత శుభ్రంగా కడిగివేయాలి. మన పెద్దవారికి ఇది చాలా బాగా తెలుసు.

చమురు వేయించి

చెవి నొప్పిగా ఉన్నప్పుడు గోరు వెచ్చని ఆముదమును రెండు చుక్కలు వేసి కాటన్ ఉంచడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon