Link copied!
Sign in / Sign up
10
Shares

పిల్లల భవిష్యత్తు బావుండాలంటే తల్లితండ్రులు చేయాల్సిన పనులు

పిల్లల్ని బాగా పెంచాలనీ, వాళ్లను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనీ మనలో ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ నిజంగా మనం పిల్లల్ని అలా తీర్చిదిద్దుతున్నామా? అని ఆలోచిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. తమ కాళ్ల మీద తాము నిలబడే వ్యక్తిత్వమున్న మనుషులుగా ఎదగడానికి కావలసిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం మరిచిపోతున్నాం.  ఒక మనిషి ఉజ్వల భవిష్యత్తుకు చదువు ఎంత అవసరమో, వ్యక్తిగా విజయం సాధించడం కూడా అంతే అవసరం.  కష్టపడి చదవడం, పరీక్షల్లో హై లెవెల్ ర్యాంక్ సాధించడం వంటి అంశాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటాం కానీ, జీవితంలో ఎలా సక్సెస్ కావాలనేది వాళ్లకు చెప్పడం లేదు.

ఒకప్పుడు జీవితం ఇంత సంక్లిష్టంగా ఉండేది కాదు. ఇంత పోటీ, ఇన్ని సమస్యలు ఉండేవి కావు. ఇప్పుడు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలంటే ఎంతో కష్టపడాలి. ఒకప్పటిలా ఎవరి పని వారు చూసుకునే రోజులు కావు. అందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి ఎక్కువ నైపుణ్యాలుంటే వాళ్లు ముందుకు వెడుతున్నారు. పిల్లలు మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలంటే వాళ్లకు ముఖ్యంగా ఆరు రకాల నైపుణ్యాలు అవసరం. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు, అప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొనే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి.

మంచి భవిష్యత్తుకు ఆరు నైపుణ్యాలు

1. నేర్చుకోవాలనే ఆసక్తి

ఏ విషయమైనా నేర్చుకోడానికి, తెలుసుకోడానికి ఒక పరిమితి అనేది లేదు. నేర్చుకోవాలనే కోరికే మనిషికి విజయాన్నిస్తుంది. అది అనుభవంతో వస్తుంది. ఏదైనా నేర్చుకోవడం ఒక సవాల్ లాంటిది. ఇంట్రిస్టింగ్ గా, సరదాగా కూడా ఉంటుంది. అందువల్ల మంచి ఫలితాలూ ఉంటాయి.

2. నేర్చుకోవడంలో నైపుణ్యం

నేర్చుకోవడం అనేది కూడా నైపుణ్యానికి సంబంధించిందే. స్కూల్ సిలబస్ లో దీన్ని కూడా ఒక అంశంగా చేర్చాలి. నేర్చుకునే నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మారిపోతూంటాయి. వాటిని మనం ఫాలో అవుతూ పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి.

3. సెల్ఫ్ నాలెడ్జి

సెల్ఫ్ నాలెడ్జ్ అంటే స్వయంగా నాలెడ్జి సంపాదించడం అందరికీ కావలసిన నైపుణ్యం. చదువు ఒక్కటీ ఉంటే సరిపోదు. వినయం, ఆత్మవిశ్వాసం, గ్రహింపు అనేవి కూడా పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా ఏదైనా చెబితే వినడం అలాగే నేర్చుకోవడం కూడా కొనసాగించాలి.

4. చుట్టూ ఉన్న వాళ్ల గురించి...

పిల్లలు చిన్నప్పుడు తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ వయసులో అది స్వార్థం కాదు. అయితే ఆ పోకడ నుంచి బయటికి వచ్చి ఇతరుల పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అన్నది కూడా పిల్లలకు నేర్పించాలి. చుట్టూ ఉన్నవాళ్లను గుర్తించడం, ఆలోచించడం కూడా పిల్లలు తెలుసుకునేలా చేయాలి.

5. కమ్యునికేషన్

ఈ రోజుల్లో కమ్యునికేషన్ అనేది చాలా ముఖ్యమైందిగా మారింది. మాట్లాడడం, రాయడం, విజువల్ కమ్యునికేషన్ అనేవి కమ్యునికేషన్ లో భాగం. ఈ రోజుల్లో ఎవరు అభివృద్ధి చెందాలన్నా ఇవి ముఖ్యం.

6. ఓపెన్ మైండ్

ఏ విషయంలోనూ దాపరికం లేకుండా ఉండాలి. మనసులో ఒకటి, పైకి ఒకటి చెప్పకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. అలాగే సక్రమంగా ఆలోచించడం, సవాళ్లను ఎదుర్కోవడం, లోతుగా ఆలోచించడం కూడా పిల్లలకు నేర్పించాలి. అవి వాళ్లను ముందుకు నడిపించడంతో పాటు నైపుణ్యాల్ని పెంచుకోవడం నేర్పించడంతో పాటు బలాన్నిస్తాయి. ఒక్కోసారి వెనక్కు తిరిగి చూసుకునేలా కూడా చేయాలి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon