Link copied!
Sign in / Sign up
11
Shares

పిల్లల బరువును, చర్మం రంగును పెంచే ఆయుర్వేద ఆహారాలు

పిల్లలు బక్కచిక్కిపోతుంటే తల్లితండ్రులకు చాలా బాధగా ఉంటుంది. బరువు పెరగడానికి, బలంగా ఉండటానికి తమకు తెలిసిన సలహాలను, వివిధ మందులు, టానిక్ లు వాడుతూ ఉంటారు. ఐతే ఇవేమీ అవసరం లేకుండా ఇక్కడ చెప్పుకునే ఆహారాలను ఇంటివద్దే తయారుచేసుకుని పిల్లలకు ఇవ్వడం వలన బరువు పెరుగుతారు, అలాగే వారి అందానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అవేంటో మీరే చూడండి. అందరికీ SHARE చేయడం మాత్రం మర్చిపోకండి..

 

బార్లీ గింజల ఆహారం - కావలసిన పదార్థాలు

*బార్లీ

*పాలు

*చక్కర

*నెయ్యి

బార్లీ ఆహారం ఎలా తయారుచేసుకోవాలి..?

ఒక కప్పు బార్లీ గింజలను తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నెయ్యిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ (గోళం లేదా కడాయి) తీసుకుని వేడి చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పొడిలా కాకుండా ముక్కలుగా చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీరు తీసుకుని, ఇందులో సరిపడినంత ఆ పిడిని నీటిలో కలిపి వేడి చేసుకోవాలి. ఇందులోకి పాలు మరియు చక్కర కలుపుకోవాలి. ఇందులోనే ఎండుద్రాక్ష మరియు డేట్స్ కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.

 

బార్లీ గింజలు - ఉపయోగాలు

పైన చెప్పిన విధంగా తయారుచేసుకున్న తర్వాత రోజుకి రెండు సార్లు లేదా సాయంత్రం ఒక పూట ఇవ్వడం వలన శరీరంలోని వేడిని బయటకు తొలగిస్తుంది. పిల్లలు త్వరగా బరువు పెరిగేలా, చర్మం రంగు ప్రకాశవంతంగా ఉండేలా తోడ్పడుతుంది. అలాగే కండరాలు బలంగా, ఎముకలు దృఢంగా ఉంటాయి.

అంజీర లేదా అత్తి పండ్లు

ఒక గ్లాస్ మూడు లేదా నాలుగు అంజీర ఫ్రూట్ (అత్తి పండ్ల) ను నీటిలో ఉంచి, కొద్ది నిముషాల తర్వాత వీటిని తినిపించాలి. రోజుకి రెండు మూడు తినడం వలన త్వరగా ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఉపయోగపడతాయి.

పెకాన్ గింజలు

పిల్లలకు ఎటువంటి మందులు, టానిక్స్ అవసరం లేకుండా పెకాన్ గింజలు, బాదం, వేరు శనగ గింజలు, జీడిపప్పు వంటి గింజలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలను ఎక్కువగా తినమని ప్రోత్సహించాలి. జంక్ ఫుడ్స్, ఆయిల్స్ ఫుడ్స్ కంటే ఇవి చాలా ఉత్తమమైనవి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon