పిల్లలకు తప్పకుండా తినిపించాల్సిన నాన్-వెజ్ ఆహారాలు మరియు తయారీ విధానం
మాంసాహారంలో అధికంగా ప్రోటీన్లు, శక్తి పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. అందుకే పిల్లల ఆహారంలో మాంసాహారం తప్పకుండా ఉండాలి. పిల్లలకు మాంసాహారం అలవాటు చేయడం కొంచెం కష్టమే. అందుకే మీకోసం, మాంసాహారాన్ని పిల్లలు తినేలా ఎలా తయారు చేయాలో మీకోసం అందిస్తున్నాం…
1. చికెన్
ఇది ప్రతి ఇంట్లో ఎక్కువగా తీసుకునే మాంసాహారం. చికెన్ మీ పిల్లల కోసం ఎలా తయారు చేయాలో తేలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు
ఉడికించి, చిన్న ముక్కలుగా కట్ చేసిన బోన్‘లెస్ చికెన్ - 1 కప్పు
చికెన్ ఉడికించిన నీరు - పావు కప్పు
తయారు చేసే విధానం
స్టెప్ 1: ఉడికించిన బోన్’లెస్ చికెన్ ను బ్లెండర్లో కానీ, ఫుడ్ ప్రాసెసర్ లో కానీ వేసి మెత్తగా పొడిపొడిగా చేయండి.
స్టెప్ 2: మెత్తగా చేసిన చికెన్ కు, చికెన్’ను ఉడికించన నీరు కలపండి. మీ పిల్లలు తినగలిగేంత చిక్కగా మిశ్రమాన్ని తయారు చేసుకోండి.
ఈ ఆహారాన్ని పిల్లల కోసం సులభంగా తయారు చేసుకోవచ్చు, అంతేకాకుండా సులభంగా తినిపించచ్చు.
2. చేప

చేపలు చాలా ఆరోగ్యకరమైన మాంసాహారం. అయితే పిల్లలకు మెర్క్యూరీ అధికంగా ఉండే సముద్ర చేపలను, తినిపించకూడదు. మంచి నీటి చేపలను మాత్రమే పిల్లల కోసం వాడండి.
కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన బోన్’లెస్ చేప ముక్కలు - 1 కప్పు
నీరు - పావు కప్పు
తయారు చేసే విధానం
స్టెప్ 1: ఉడికించిన బోన్,లెస్ చేప ముక్కలను బ్లెండర్లో వేసి, మెత్తగా అయ్యేంత వరకు ఉంచండి.
స్టెప్ 2: దీనికి తగినన్ని నీరు కలిపి, మీ పిల్లలు తినే విధంగా చేసుకోండి.
ఈ మిశ్రమానికి, కూరగాయ ముక్కలు, కొంచెం ఉప్పు కలిపితే పిల్లలు తినడానికి ఇష్టపడుతారు. ముల్లు లేకుండా చూసుకోండి.
3. ఆమ్లెట్

అందరి ఇళ్ళల్లో ఎక్కువగా, వీలుంటే రోజుకు ఒకసారైనా తినగలిగే ఆహారం, ఎగ్ ఆమ్లెట్. దీనిని తయారు చేసుకోవడం చాలా సులువు. మీ పిల్లల కోసం ఎలా తయారు చేయాలో చూడండి.
కావాల్సిన పదార్ధాలు
గుడ్లు - 2
పాలు - 1 కప్పు
సన్నగా తరిగిన క్యారట్ - పావు కప్పు
వెన్న లేదా నూనె - తగినంత
తయారు చేసే విధానం
స్టెప్1: పాన్ తీసుకుని, వేడి చేయండి. ఆమ్లెట్ కోసం వెన్న లేదా నూనె పాన్ మీద వేడి చేసుకోండి.
స్టెప్ 2: గుడ్లు, పాలు, క్యారెట్ తురుము బాగా కలిపి, మిశ్రమాన్ని తయారు చేసుకోండి.
స్టెప్ 3: ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, వేడి చేసిన పాన్ మీద వేసి, కాలే వరకు ఉంచండి.
మీ పిల్లలకు ఇష్టంగా తినాలంటే, ఆమ్లెట్ పైన చీస్ వేయండి.
గమనిక: మీ పిల్లలకు మాంసాహారం తినిపించే ముందు, డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి.
