Link copied!
Sign in / Sign up
118
Shares

పిల్లలకు మొదటి 5 సంవత్సరాలు అత్యంత కీలకం: అందుకు ఇవే 6 కారణాలు


పిల్లల ఎదుగుదల మొదటి 5 సంవత్సరాలలో ఉన్నత మరెప్పుడూ ఉండదు. వారు మానసికంగా, శారీరకంగా అధిక భాగం ఈ వయస్సులోనే ఎదుగుతారు. అందుకే సైకాలజిస్టులు మరియు పీడియాట్రిషన్స్ పిల్లల జీవితంలో ఈ 5 సంవత్సరాల కాలం అత్యంత కీలకం అని చెప్తారు. ఇప్పుడు వారు ఆలా చెప్పడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాము.

1. వేగంగా పెరిగే మేధస్సు

మీ బిడ్డ ఈ భూమి మీదకు వచ్చే సరికే తన మెదడులో కొని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. అవి బిడ్డ జన్మించిన తరువాతనే ఉత్తేజం చెంది పిల్లలు సొంతంగా ఆలోచించే శక్తిని అందచేస్తాయి. ఈ ప్రక్రియ మొదటి 5 సంవత్సరాలలో అధికంగా ఉంటుంది. మనం ఏమి నేర్పిస్తే అది పిల్లలు  వేగంగా నేర్చుకుంటారు. అందుకే ఈ వయస్సులో పిల్లలకు ఏమి నేర్పించిన భాద్యతాయుతంగా నేర్పించాలి. మంచి అలవాట్లు ఈ వయ్స్సునుండే అలవాటు చేయాలి.

2. అత్యంత చురుకుదనం

ఈ వయస్సులో పిల్లలు అత్యంత చురుకుగా ఉంటారు. వారి మెదడులో మనం ఏమి చెప్పిన శిలాశాసనం లాగా ప్రింట్ అయిపోతుంది. అందువలన ఈ సమయంలో వారికి అందించే విద్య అత్యంత నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోవాలి

3. మాట్లాడటం ఎలానో నేర్చుకుంటాడు

ఈ సమయంలో పిల్లల చూపు మరియు వినికిడి శక్తి పెరుగుతుంటుంది. ఈ వయస్సులోనే పిల్లలు మాట్లాడటం కూడా నేర్చుకుంటారు. అందువల్ల మీరు పిల్లల ముందు మాతృ భాషను మాట్లాడితే అదే తొందరగా నేర్చుకుంటారు. అంతే కాకుండా చిన్న వయస్సులోనే మీరు వాళ్ళకి వివిధ భాషలు నేర్పించవచ్చు. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఈ వయస్సు నుండే నేర్పడం ప్రారంభిస్తే పిల్లలు సులువుగా నేర్చుకుంటారు.

4. పునాది

మొత్తం జీవితం ఒక ఇల్లు అయితే మొదటి 5 సంవత్సరాలు ఆ ఇంటికి పునాది వంటివి. పునాది ఎంత బలంగా ఉంటె ఇల్లు అంత బలంగా ఉంటుంది. అలాగే, పిల్లల జీవితంలో మొదటి 5 సంవత్సరాలు పాజిటివ్ గా ఉంటె జీవితం అంతా బాగుంటుంది. పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి మార్గంలో నడుస్తారు.

5. చిన్న చిన్న విషయాలు పెద్ద మార్పుని తీసుకురాగలవు

ఈ వయస్సులో ఏమి చెప్పిన నేర్చుకోగలరు కనుక మీరు పిల్లలకు వీలైనన్ని వాటి మీద అవగాహన కల్పించండి. వీడియో గేమ్స్, గ్రాఫిక్స్, పిల్లలకు మంచి నేర్పే పంచతంత్ర కథలు వంటివి పరిచయం చేయండి. ఏమంత వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహద పడతాయి.

6. ఆహారం

ఎప్పటికి వరకు మానసిక ఎదుగుదల మాట్లాడుకున్నాం కదా. ఈ వయస్సులో పిల్లల శారీరిక ఎదుగుదల కూడా అత్యత వేగంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులుగా వారి ఎదుగుదలకు దోహదం చేసే పౌష్టికాహారం మనం అందచేయాలి. శారీరికంగా ఎదగడానికి పనికొచ్చే  ఆటలు ఈ వయస్సులో పిల్లలకు ముఖ్యం. చివరగా, పిల్లలు ఇతర పిల్లలతో ఎలా కలుస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారా, కలిసి ఉంటారా అనేది కూడా గమనిస్తూ ఉండండి.

అందరికి తప్పకుండా SHARE చేయండి

ఇవి కూడా చదవండి

తల్లుల గురించి కొన్ని ఆసక్తికర మరియు హాస్యాస్పద నిజాలు - ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు

పిల్లల పెంపకం: ఉమ్మడి కుటుంబం మరియు చిన్న కుటుంబంలోని తేడాలు 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon