Link copied!
Sign in / Sign up
12
Shares

పెసర పిండితో కలిగే ఉపయోగాలు తెలిస్తే మహిళలు అస్సలు వదిలిపెట్టరు : అందం + ఆరోగ్యం

పెసలు గురించి బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. పెసలను ముక్కలుగా చేసుకుని పెసల అన్నం, పెసర పిండితో పెసర వడలు చేసుకుంటూ ఉంటారు. అయితే పెసలతో ముఖ సౌందర్యాన్ని, జుట్టు రాలకుండా, జుట్టు అందంగా కాంతివంతంగా ఎలా ఉంచుకోవచ్చో బహుశా చాలామందికి తెలియక పోయుండవచ్చు. ఇక్కడ చెప్పుకునే విధంగా చేస్తే మహిళలు పెసర పిండిని అస్సలు వదిలిపెట్టరు. ఆ ఉపయోగాలేంటో మీరే చూడండి.

మీ ముఖం ఎప్పటికీ అందంగా కనిపించాలంటే

ఒక 50 గ్రాముల పెసలను తీసుకుని రాత్రి పడుకునేముందు ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన వీటిని పిండిగా చేసుకుని ఇందులో ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 15 నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మీ ముఖంమెరిసిపోతుంది.

జిడ్డు చర్మం లేకుండా

చాలామంది ఎన్ని సార్లు ముఖం కడుక్కున్నా సరే ఒక గంట లేదా రెండు గంటల తర్వాత మళ్ళీ జిడ్డు వస్తూ ఉంటుంది. అయితే పెసరపిండిని ముఖంపై అప్లై చేసుకుని శుభ్రం చేసుకున్నా గానీ, ఒక స్పూన్ పెసరపిండిలో కాస్త ఆలివ్ ఆయిల్ కలిపి ముఖంపై రాసుకుని 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై జిడ్డు, ముఖం పగలడం తగ్గిపోతుంది.

ముఖం కాంతివంతంగా ఉండేలా

ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల నిమ్మరసం తీసుకుని అందులో ఒక స్పూన్ పెసర పిండి కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్ గా వేసుకుని ఒక 20 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎండలో తిరిగివచ్చిన వారు ముఖం కందిపోతూ ఉంటే ఈ విధంగా చేయవచ్చు. వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలు.

ముఖంపై వెంట్రకలు తొలగించడానికి

ముందుగా 100 గ్రాముల పెసలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం వీటిని పిండిగా చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల గంధపు పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల ఆరంజ్ తొక్కల పొడిని కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త పాలు పోసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని మర్దనా చేసుకోవడం వలన ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు రాలకుండా జుట్టు పెరగడానికి

జుట్టు రాలడం ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య కాబట్టి. ఒక స్పూన్ పెసర పిండిలో రెండు స్పూన్ల ఉసిరి రసం కలిపి తలపై రాసుకుని ఒక అరగంట తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది మరియు జుట్టు పెరిగేలా చేస్తుంది.

చుండ్రు సమస్య తగ్గాలంటే

రెండు స్పూన్ల వేప నూనెను ఒక స్పూన్ పెసరపిండిలో కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తల చుండ్రుతో బాధపడేవారు రాసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon