Link copied!
Sign in / Sign up
70
Shares

పేరులోని మొదటి అక్షరం మీ జీవితం మీద ఎలా ప్రభావం చూపెడుతుందో తెలుసుకోండి

ఇతను వాళ్ళ అబ్బాయి, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న గారు ఎవరో తెలుసా..ఇలా ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు, మన గురించి ఇతరులతో చెప్పేటప్పుడు పేరుతో చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మంచి చేసినా మనవల్ల ఏదైనా చెడు కలిగిన పేరే మొదట బయటకు వస్తుంది. అందుకే ఒకరికి పేరు పెట్టేటప్పుడు అంతగా ఆలోచిస్తారు. అయితే ఆ పేరులోని మొదట అక్షరం మీ గురించి, మీ జీవితం గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి.

D, M, T తో పేరు మొదలయితే

పై అక్షరాలతో పేరు మొదలయినట్లయితే కష్టపడే మనస్తత్వం. ఏదైనా సరే కష్టం లేనిదే సక్సెస్ ఉండదు అని భావించే రకం. ఒకరి మీద ఆధారపడే టైప్ కాదు. సొంతంగా అయినా సరే విజయం సాధించగలరు. వారిపై వారికి నమ్మకం ఎక్కువ కాబట్టి, బిజినెస్ రంగం ఐతే ఈ పేరు వారికి బాగుంటుందని చెబుతున్నారు.

E, N, H, X మీ పేరులో ఉంటే

డబ్బు గురించి ఎప్పుడు భయపడరు కానీ తమ దగ్గర లేనప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది. ఎందుకంటే వీరికి పొదుపు చేయడం కన్నా ఆ క్షణం సంతోషంగా ఉండటమే ముఖ్యమని ఫీలవుతారు. అలాగే అందరినీ ఒకే విధంగా చూస్తారు. కానీ వీరి జీవితంలో పొదుపు అనేది ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు.

V, U, W లతో మీ పేరు మొదలయితే

ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత పేరు సంపాదించుకున్నా సరే అందరితో ఒకే విధంగా డౌన్ టు ఎర్త్ ఉంటారు. పొగరు తక్కువ, ఇతరులంటే గౌరవం ఎక్కువ. అందరినీ సమానంగా చూస్తారు. వీరి బలం బలహీనత వీరి కుటుంబమే. ఎందుకో ఏమో గానీ అదృష్టం మాత్రం వీరికి దగ్గరగానే ఉంటుంది.

A, I, J, Y, Q అక్షరాలతో పేరు ఉంటే

ఈ అక్షరాలతో పేరు మొదలయినట్లయితే వీరు ప్రతి పనినీ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే చిరునవ్వుతో స్వాగతిస్తారు. తనకు ఎదురుగా ఉన్నది తన చెడు కోరేవాడు, తన శత్రువైనా స్నేహితుడిలానే చూడగల గొప్ప స్వభావం వీరిది.

B, R, K లతో పేరు మొదలయితే

వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగినవారు. తన అనుకున్నవాళ్ళు ఎప్పుడు తనతో పాటు ఉండాలని కోరుకుంటారు. పదిమందిలోనూ మాట్లాడే ధైర్యం చాలా తక్కువగా ఉండటం వలన గొప్ప గొప్ప అవకాశాలను వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది.

C, G, S, L అక్షరాలతో పేరు ఉంటే

ఈ అక్షరాలతో పేరు మొదలయినట్లయితే ప్రకృతి ప్రేమికులు. మంచి స్వభావం మరియు మంచి జ్ఞానం కలిగినవారు. ఒకసారి ఏదైనా నచ్చితే వారి లైఫ్ లాంగ్ దాన్ని విడిచిపెట్టరు. స్టెప్ బై స్టెప్ లైఫ్ లో ఎదుగుతూనే ఉంటారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే.

O, Z అక్షరాలతో పేరు మొదలయితే

ఈ అక్షరాలతో పేరు ఉంటే గనుక ఒకరికి సహాయం చేయడం, చారిటీల కోసం పనిచేయడం చాలా ఇష్టం. అయితే వీరిపై కొందరు పనికిరాని విషయాలను చెప్పి పక్కదారి పట్టిస్తూ ఉంటారు. ఒకరికింద పనిచేయడానికి ఇష్టపడరు. వీరి ఆలోచన చాలా మంచిది.

P, F అక్షరాలతో పేరు ఉంటే

వీళ్ళ వ్యక్తిత్వమే లైఫ్ లో వీరు సక్సెస్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక పని చేస్తున్నారంటే ఎంతో చక్కగా, ప్రణాళిక వేసుకుని చేస్తారు. అదే వీరి సక్సెస్ సీక్రెట్. చాలా తెలివైన వారు కాబట్టి ఆపదలలో చిక్కుకోకుండా చాకచక్యంగా తమ పనులు చేసుకోగలరు.

ఇందులో మీకు దగ్గరగా అనిపిస్తే COMMENT చేయవచ్చు. మంచి సమాచారం అనిపిస్తే SHARE చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon