Link copied!
Sign in / Sign up
4
Shares

భోజనం చివర్లో పెరుగుతో తినాలా..? మజ్జిగతో తినడం మంచిదా..!

ఆరోగ్యానికి పెరుగు మంచిదా లేక మజ్జిగ మంచిదా అని చాలామందికి ఉన్న అనుమానం. కమ్మకమ్మని గడ్డ పెరుగు తింటుంటే ఆ రుచి, కమ్మదనమే వేరు. అయితే పెరుగు ఎక్కువగా తీసుకోవడం వలన వాతరోగాలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగుతో కొంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాసరే మజ్జిగే ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక భోజనంలో పెరుగుతో తినాలా లేక మజ్జిగతో తినాలా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అప్పట్లో పెరుగు ఉన్నా కూడా…

మన పూర్వీకులు, తాతలు అమ్మమ్మ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఆవులు, గేదెలు ఎక్కువగా ఉండేవి. పాలు ఎక్కువగా ఉండటం వలన స్వచ్ఛమైన గడ్డ పెరుగు లభించేది. అయినా సరే వారు పెరుగుకు బదులుగా పెరుగును చిలికి వెన్న తీసి మజ్జిగగా చిలికేవారు. ఇంటికి ఎవరైనా వస్తే ఇప్పుడు కూల్ డ్రింక్స్, కాఫీ, టీ లు ఇచ్చి పంపిస్తున్నాం. కానీ అప్పుడు మాత్రం ఒక పెద్ద గ్లాస్ నిండా చల్లని మజ్జిగ ఇచ్చేవారు. చూశారు కదా, పెరుగు ఎంత ఉన్నాసరే వారు మజ్జిగకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో. మజ్జిగ శరీరానికి అంత చలువ కాబట్టే మజ్జిగను ఆహారంగా తీసుకోమని చెబుతున్నారు.

మజ్జిగ ఉపయోగాలు :

◼️ సమ్మర్ లో లేదా ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు శరీర వేడి ఎక్కువగా ఉంటుంది, అటువంటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగను ఇవ్వడం వలన శరీర వేడి తగ్గి చల్లగా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా కూడా కాపాడుతుంది.

◼️ కొందరి శరీరం ఎప్పుడు వేడిగా ఉంటుంది, అటువంటివాళ్ళు పెరుగుకు బదులుగా మజ్జిగతో అన్నం తినడం లేదా ఉదయం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం మంచిది. ఉదయాన్నే అన్నంలో మజ్జిగ కలుపుకుని ఉల్లిపాయ నంజుకుని తినడం వలన శరీర వేడి ఉండదు.

◼️ పెరుగును మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు తీసుకోవచ్చని అంటున్నారు, కానీ అందులో కాస్త నీరు కలిపి తీసుకోవాలి. రాత్రి పూట పెరుగు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాయువు ఎక్కువై వాత రోగాలకు కారణమవుతుందట. అదే మజ్జిగ తీసుకోవడం వలన వాత రోగాల సమస్య నుండి దూరం చేస్తుంది.

◼️ పొట్ట ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ మజ్జిగలో సైన్ధవ లవణం, ఇంగువ, జీలకర్రను కాస్త కలుపుకుని సేవించడం వలన ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

◼️ విరేచనాల సమస్య ఉన్నప్పుడు మజ్జిగలో కాస్త తేనె లేదా వేయించిన జీలకర్రను కలిపి తీసుకోవడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

◼️ ఎండాకాలంలో మజ్జిగలో కాస్త అల్లం, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరను మిక్స్ చేసి కొన్ని నిముషాల పాటు పక్కన ఉంచుకుని, ఆ తర్వాత కలబెట్టుకుని తాగడం వలన మీ ఆరోగ్యానికి మంచిది.

సో, తెలుసుకున్నారు కదా పెరుగు కన్నా మజ్జిగే ఆరోగ్యకరం. అందుకని మీ భోజనంలో పెరుగును కాకుండా మజ్జిగ వేసుకుని మెత్తగా కలుపుకుని తీసుకోవడం వలన మీ శరీరానికి చాలా మంచిది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon