Link copied!
Sign in / Sign up
19
Shares

పీరియడ్స్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఆహారాలు తినకూడదు : చాలా డేంజర్

మహిళలను ప్రతి నెల బాధించే విషయం రుతుక్రమం (పీరియడ్స్). ఒకవైపు రక్తస్రావం, మరోవైపు రెండు మూడు  రోజుల పాటు నీరసం, అలసట,  వికారంగా ఉండటం, ఏ పని చేయడానికి ఇష్టపడకపోవడం జరుగుతూ ఉంటాయి. మహిళలను గౌరవించాలి అని చెప్పడానికి ఈ ఒక్కటి చాలు. ఐతే ఇటువంటి సమయంలో  మహిళలు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు మరియు వైద్యులు. ఎందుకో, అవేంటో మీరే తెలుసుకోండి..

కాఫీ

ఎస్..పీరియడ్స్ సమయంలో మీకు కాఫీ అంటే ఎంత ఇష్టమున్నా సరే ఆ రెండు రోజుల పాటు దూరంగా ఉండాలని చెబుతున్నారు. లేకపోతే ప్రతి రోజూ తీసుకునే దానికన్నా సగానికి తక్కువగా తీసుకోవడం చేయాలి. కాఫీకి బదులుగా గ్రీన్ టీ గానీ టొమాటో జ్యూస్ లేదా ఇంటి దగ్గరే చేసుకున్న సూప్స్ తీసుకోవడం మంచిది. కాఫీ ఎందుకు వద్దని చెబుతున్నారంటే బ్లడ్ ప్రెజర్ పెరిగి టెన్షన్ ఎక్కువై హృదయ సంబంధిత సమస్యలు వస్తాయని, చిన్న విషయాలకు సైతం ఎక్కువ భయపడతారని అంటున్నారు.

మసాలా పదార్థాలు

సాధారణంగానే మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. ఇక పీరియడ్స్ సమయంలో ఐతే జీర్ణప్రక్రియ నెమ్మదిగా ఉండటం వలన మసాలా ఫుడ్స్ తీసుకుంటే అరుగుదల ఆలస్యంగా ఉంటుంది. అలాగే చర్మ సమస్యలు, చర్మంపై దద్దుర్లు, మంట కలగడం, రాషెస్ వంటివి కలుగుతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ హానికరం.

పాల ఉత్పత్తులు

పీరియడ్స్ సమయంలో డైరీ ప్రాడక్ట్స్ అయిన పాలు, వెన్న, క్రీము పదార్థాలు దూరంగా ఉండటం చాలా వరకు ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని తిమ్మిరికి గురి చేస్తాయి. వీటికి బదులుగా మజ్జిగ తీసుకోవడం మంచిది మరియు ఆరోగ్యకరం కూడా.

మత్తు పదార్థాలు

నిజానికి ఆల్కహాల్, మత్తు పదార్థాలు ఈ సమయంలో తీసుకోకూడదు అని అందరికీ తెలిసి ఉంటుంది. కానీ చెప్పాల్సిన బాధ్యతగా మేము అనుకుంటున్నాం. పీరియడ్స్ అప్పుడు ఆల్కహాల్ పదార్థాలు తీసుకోవడం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదలై పీరియడ్స్ పై ప్రభావాన్ని చూపెడుతుంది. అందుకని కొబ్బరి నీరు లేదా లైమ్ సోడా సేవించడం చాలా ఉత్తమం.

వేయించిన పదార్థాలు

పీరియడ్స్ సమయంలో చిప్స్, వేయించిన పదార్థాలు, మసాలా ఫుడ్స్ తీసుకోవాలని ప్రతి ఒక్కరిలో కలగడం సర్వ సాధారణమే. ఐతే ఈ సమయంలో మిమ్మల్ని మీరు బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వీటివలన  ఈస్ట్రోజన్ హార్మోన్ అధిక స్థాయిలో ఉత్పన్నమైన చర్మ సమస్యలు రావడానికి మరియు మీ మూడ్ ను మార్చివేస్తాయి. అలాగే తర్వాత నెల పీరియడ్స్ పై ప్రభావం ఉంటుంది.

ప్రతి మహిళకు ఇది తెలియాల్సిన విషయం కాబట్టి అందరికీ SHARE చేయగలరు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon