Link copied!
Sign in / Sign up
10
Shares

ప్రేగ్నన్ట్ అవ్వడానికి పీరియడ్స్ తరువాత ఎప్పుడు సెక్స్ లో పాల్గొనాలి?


అండం విడుదల అవ్వడం అంటే ఏంటి?

మీ శరీరం, ఫెలోపియన్ ట్యూబ్(అండాశయమునుండి గర్భకోశమునకు గల నాళమార్గము) లోకి అండాన్ని విడుదల చేయడాన్ని అండోత్సర్గం (Ovulation) అంటారు. ఈ విడుదలైన అండం పురుష వీర్యకణంతో కలిసి గర్భాశయంలోకి చేరినప్పుడు మీరు గర్భం దాలుస్తారు. అండం విడుదల మీ శరీరంలో ప్రతి నెల జరుగుతుంది. అందుకే మీరు గర్భం దాల్చాలన్నా, గర్భాన్ని నిరోధించాలన్నా, ప్రతి నెల అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అండం విడుదల అవ్వడం అంటే ఏంటి?

స్త్రీలలోని రుతుక్రమం మొత్తం నాలుగు దశల 28 రోజుల పాటు ఉంటుంది. చివరి దశ 15 నుండి 28వ రోజు వరకు ఉంటుంది. సాధారణంగా స్త్రీలు గర్భం ధరించే అవకాశం, అండం విడుదల అయ్యే 5 రోజుల ముందు నుండి మొదలవుతుంది.

మీ చివరి ఋతుక్రమ దశ, నెలలోని మొదటి రోజు మొదలైతే, 14 వ రోజు అండం విడుదలవుతుంది. మీకు గర్భం దాల్చే అవకాశం 10 నుండి 17 వ రోజు వరకు ఉంటుంది. వీటిలో 12, 13, 14 వ రోజులలో ఎక్కువ అవకాశం ఉంటుంది. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon