Link copied!
Sign in / Sign up
2
Shares

పీరియడ్స్ (నెలసరి) సమయంలో ఈ ఊరి మహిళలు గుడికి వెళ్లారు : ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రతి నెల మహిళల శరీరంలో తప్పకుండా వచ్చేది నెలసరి (పీరియడ్స్). మహిళలను వేధించే ఈ సమస్య వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇంట్లోకి రాకుండా బయటే ఉండాలని, ఎవరినీ తాకకూడాదని, ఏ వస్తువులు ముట్టుకోకూడదని, ముఖ్యంగా దేవుడి పటాలు, ఆలయాలలోకి అడుగు పెట్టకూడదని అంటున్నారు. ఐతే ఇది మూఢాచారం అని, ఇది చాలా తప్పని అంటున్నారు నిపుణులు. కాగా పీరియడ్స్ సమయంలో ఇక్కడ చెప్పుకునే ఆలయంలోకి మహిళలు అడుగుపెడితే తేనెటీగలు కుడతాయట. అసలు నిజం ఏంటో తెలుసుకోండి… మహిళలు తప్పక అందరికీ SHARE చేయండి.

పీరియడ్స్ అప్పుడు ఆలయంలోకి వెళితే తేనెటీగలు కుడతాయా..!!

ఇది చాలాకాలంగా ఆ గ్రామంలో ప్రచారంలో ఉన్న విషయం. నిజానిజాలు కాసేపు పక్కన పెడితే అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందో చూడండి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలోగల నల్లమల అటవీ ప్రాంత సమీపంలో ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలోకి పీరియడ్స్ సమయంలో అడుగుపెడితే అక్కడ ఉండే తేనెటీగలు కుడతాయట. మహిళలు గుంపుగుంపులుగా వెళ్తుండగా వారిలో కొందరు మగవారు కూడా ఉన్నారట. అప్పుడు కొన్ని తేనెటీగలు వచ్చి దాడి చేశాయట. మహిళలలో ఎవరో నెలసరితో వచ్చారని అందుకే ఇలా తేనెటీగలు దాడి చేశారని మగవారు అందరిపై అరవడం మొదలుపెట్టారట. అందుకే నెలసరితో ఉన్నప్పుడు ఈ ఆలయం చుట్టుపక్కలకు రాకూడదని అంటున్నారు.

అసలు కథ ఏమిటంటే..

ఇది దాదాపు 1500 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. మయూర మహర్షి కోరిక మేరకు ఇక్కడ శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిశాడని, ఇక్కడ రంగ అనే గిరిజన మహిళ మహావిష్ణువును తపస్సు చేయగా ఆమె కోరికకు మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నారట. ఇక్కడ కనిపిస్తున్న నీటిగుండాన్ని మయూర మహర్షి నెమలిగా రూపం దాల్చి తన ముక్కు, గోళ్ళతో నీటిగుండాన్ని తవ్వాడట. అందుకే ఈ స్థలాన్ని ననెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం అని అంటారు.  ఇక పీరియడ్స్ తో ఉన్నప్పుడు ఎవరైనా ఆలయంలోకి లేదా ఆలయం చుట్టుపక్కలకు అడుగుపెడితే తేనెటీగలు కుడతాయని, ఆలయ పవిత్రతను కాపాడటానికే ఇలా చేస్తాయని చెబుతున్నారు గ్రామస్థులు. ఐతే ఇది మూఢ విశ్వాసం అని కొట్టిపారేసే వాళ్ళు లేకపోలేదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon