Link copied!
Sign in / Sign up
0
Shares

పీరియడ్స్ సమయంలో మహిళలు తప్పక చేయాల్సిన 5 పనులు

పీరియడ్స్ ప్రతి నెల మహిళలను వేధించే సమస్య.. ఇది వారికి మంచేనా, చెడా? అని పక్కనపెడితే ప్రతి నెల రుతుక్రమం కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దాదాపు 3 నుండి 5 రోజుల పాటు ప్రత్యక్ష నరకమే అని చెప్పాలి. ఈ ఒక్క విషయం చాలు, మహిళలను గౌరవించడానికి అని అంటారు. ఐతే ఈ నెలసరి సమయంలో మహిళలు తమకు తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులేంటో తెలుసుకుని, ఇక ఎప్పుడు జరగకుండా జాగ్రత్త పడండి..

ఆహారం

అవును, నిజమే.. పీరియడ్స్ సమయంలో ఇంట్లో దూరంగా ఉండటం, ఏదో నేరం తప్పు చేసిన వారిలా ఒక పక్కన కూర్చోవడం చాలా బాధాకరమే. అలాగే ఈ  సమయంలో ఎందుకో గానీ చాలామంది ఆహారానికి దూరంగా, ఇష్టంలేనట్లుగా ఉంటారు. ఇది చాలా తప్పు, ఈ సమయంలో సరైన డైట్ ప్రకారం సరైన సమయానికి తప్పకుండా ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి దూరంగా ఉంటున్నవారు ఇకపై ఇలా చేయకండి.

ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి

మహిళలు చేస్తున్న అతి సాధారణమైన తప్పులలో ఇది ఒకటి. కొందరిలో పీరియడ్స్ సరిగ్గా నెలకు జరగకపోవచ్చు, మరికొందరిలో ముందే జరగవచ్చు. కాబట్టి, పీరియడ్స్ జరిగిన డేట్ ను రాసిపెట్టుకోవడం వలన ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడవచ్చు, నెలసరి ప్రకారం మీ ప్లాన్ వేసుకోవచ్చు.

పీరియడ్స్ - రక్తం రంగు

ఇది వరకే మనం టైనీ స్టెప్ తెలుగులో దీని గురించి చెప్పుకున్నాం. పీరియడ్స్ సమయంలో వచ్చే రంగును బట్టి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చని. ఎరుపు, లేత ఎరుపు, పింక్..ఇలా పీరియడ్స్ రక్తంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఐతే ఎప్పటిలా కాకుండా ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇది మాములే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

శృంగారం

పీరియడ్స్ సమయంలో దంపతులు శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అనే అపోహ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం పీరియడ్స్ సమయంలో శృంగారం తప్పేమీ కాదని అంటున్నారు. ఐతే సేఫ్ సెక్స్ ఈ సమయంలో చాలా ముఖ్యం. ఎందుకంటే మహిళ శరీరం నుండి ఈ టైంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చేరి ఇద్దరికీ అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి..

ఈ రెండు అస్సలు చేయకూడదు

నెలసరి సమయంలో దాదాపు మహిళలందరూ ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో వారికి చాలా ఇబ్బందిగా, నీరసంగా ఉంటుంది. ఏం చేయాలనీపించదు. మనస్సుకు కష్టంగా ఉండటం వలన. ఐతే ఈ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వలన తిమ్మిర్లు వస్తాయని, అప్పుడప్పుడు శరీరాన్ని కాస్త కదల్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

దయచేసి ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా SHARE చేయగలరు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon