Link copied!
Sign in / Sign up
0
Shares

పీరియడ్స్ నోప్పులు తగ్గడానికి 4 చిట్కాలు


ప్రతినెల పీరియడ్స్ వచ్చినపుడు నెప్పులతో ఎంతో బాధ పడుతూ ఉంటాము. కానీ అవి మీ దిన చర్యలను బాధించకుండా ఎలా ఎలా వాటిని తగ్గించుకోవాలి అని తెలుసుకుందాం రండి. ఈ రకమైన నెప్పులు తగ్గడానికి అనేక మార్గాలను మనం వినియోగించవచ్చు. మందులు తీసుకోవడం,ప్రకృతి విధానాలు, మనం తీసుకునే ఆహరం లో మార్పులు మరియు ఇతర మార్గాలు. వీటిలో కొన్ని విధానాల గురించి చూద్దాం రండి.

ప్రకృతి విధానాలు:
1. ఆహరం

విటమిన్ ఈ,B1 మరియు B6 , మెగ్నీషియం,జింక్, ఒమేగా 3 వంటి పోషక పదార్ధాలు నెప్పులు ని తగ్గించడం లో సహాయపడుతాయి.

కాఫిన్ పదార్ధాలు దయచేసి పీరియడ్స్ ముందు మరియు తరువాత కొద్దీ రోజులు తీసుకోకండి. అది మీ నెప్పులను ఇంకా ఎక్కువ చేస్తాయి.

చెడ్డ కొవ్వు పదార్ధాలను తీసుకోవడం తగ్గించి మంచి కొవ్వు ఉన్న ఆలివ్ నూనె వంటి పదార్ధాలను తీసుకోండి.

కొన్ని రకాల టీలు నెప్పులను తగ్గించగలవు, అవి ఆస్ట్రోజెన్ అనే హొరొమోన్ ని విడుదల చేస్తుంది అది నెప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.కానీ ఇవి తీసుకునేముందు మీ డాక్టర్ను సంప్రదించండి.

2. హీట్ పాచెస్

హీట్ పాచెస్ అనేవి 12 గంటలు దాక వేడిగా ఉండగలవు. ఆ వేడి మీకు నెప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. హీట్ పాచెస్ ని కడుపు యొక్క కింది భాగం లో ఉంహించాట్లు అయితే అది నెప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కానీ వీటిని ఉపయోగించక ముందు సూచనలను సరిగ్గా చదవండి.

వైద్య విధానాలు
1. అక్యూపంక్చర్ లేదా సూది చికిత్స

మీరు నెప్పి నుండి తక్షణ ఉపశమనం కొరకు డాక్టర్ను సంప్రదించండి. వారు దాని కొరకు అక్యూపంక్చర్ లేదా సూది చికిత్స ను సూచించవచ్చు. మీకు నెప్పులు ఎక్కువగా ఉన్నపుడు ఆసీక్యూపంక్చర్ చికిత్స తీసుకోమని వైద్యులు సిఫార్సు చేస్తారు.

నడుము,పదాలు వంటి కొన్ని చోట్లలో ఈ చికిత్స చేయడం వలన ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి, అవి నెప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఎప్పుడైనా సరే ఈ చికిత్స కొరకు మంచి నిపుణులను సంప్రదించండి.

2. మందులు

నెప్పి మరి ఎక్కువగా వుండి తట్టుకోలేని పరిస్థితుల్లో మీ వైద్యులను సంప్రదించి వెంటనే మందులను వేసుకోండి. ఒక్కొక్కరి శరీరం వేరు వేరు తీరులో పనిచేస్తుంది అందువలన అందరికి ఒకేరకమైన మాత్రలు అనువుగా ఉండవు.

పీరియడ్స్ అప్పుడు నెప్పులు ప్రోస్టాల్గ్లాండిన్స్ అనేది శరీరం లో విడుదల అవుతుంది. NSAID వాటి ఉత్పత్తిని తగ్గించి తద్వారా నెప్పి నుండి ఉపసమాంమ్ కలిగిస్తుంది.

NSAID మీకు మంచిదేనా కదా అని మీ డాక్టరును సంప్రదించి తెలుసుకోండి.

ఈ నొప్పి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా?

పీరియడ్స్ అప్పుడు వచ్చెనెప్పులు బాధాకరంగా వుండి కష్టం కలిగించిన దీని వలన ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.

ఇది మీకు హృదయసమస్యల నుండి కాపాడుతుంది మరియు జీవన కాలాన్ని కూడా పెంచుతుంది.

నెప్పులు భరించలేనిదిగా ఉండవచ్చు అటువటిని సమయములో పైచెప్పబడిన విధానాలని పాటించండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon