Link copied!
Sign in / Sign up
35
Shares

పీరియడ్స్ గురించి ఈ 7 మూఢ నమ్మకాలు మహిళలు అసలు నమ్మకండి

మనం 21వ దశాబ్దంలో బతుకుతున్నా, కొన్ని విషయాలలో మూఢత్వం ఇంకా మనల్ని విడిచి వెళ్ళలేదు. ఆడవాళ్ళు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ఈ సమయంలో, కొన్ని మూఢనమ్మకాలు ఆ అడుగులను ముందుకు పడకుండా అడ్డుకుంటున్నాయి. పీరియడ్స్, అది అత్యంత సహజం, అది తప్పు కాదు, పాపం కాదు. ఈ సృష్టి ముందుకు నడవడానికి అవసరం. అలాంటి పీరియడ్స్ చుట్టు అలుముకున్న కొన్ని మూఢనమ్మకాలను, బద్దలుకొట్టాల్సిన సమయం ఇదే… ఆ మూఢనమ్మకాలు ఏంటో చూద్దాం…

1. పులుపు తినకూడదు

దీనికి ఎటువంటి ఆధారం లేదు. పీరియడ్స్ సమయంలో, పులుపు తినడం నొప్పిని పెంచుతుందని, అందరూ అనుకుంటారు, నమ్ముతారు. కానీ ఇది ఎక్కడ శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. ఏది ఏమైనా మీ పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

2. పీరియడ్స్ సమయంలో ఆడవాళ్ళను తాకకూడదు

ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోకండి. పీరియడ్స్ సమయంలో, రక్తం రావడం సహజం, దాని కోసం మీరు ఎలానో సానిటరీ పాడ్స్ వాడుతారు. అంతేకాని మీ పీరియడ్స్ సమయంలో మీ శరీరం మొత్తం ఏదో జరిగిపోదు. తాకినంత మాత్రాన ఏ కొంప మునిగిపోదు.

3. వేడి నీళ్ళు రక్తాన్ని ఎక్కువ చేస్తాయి

పీరియడ్స్ సమయంలో వేడి నీళ్ళు తాగితే, రక్తం ఎక్కువగా పోతుంది అని చాలా మంది నమ్ముతారు. వేడి నీరు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అంతే కానీ రక్తం ఎక్కువగా పోదు.

4. ట్యంపూన్స్ లోపలికి వెళ్లిపోతాయి

పీరియడ్స్ సమయంలో వాడే ట్యంపూన్స్ లోపలి వెళ్ళిపోతాయేమోనని చాలా మంది బయపడుతారు. అలా ఎట్టి పరిస్థితిలో జరగదు. భయపడకుండా ట్యంపూన్స్ వాడండి.

5. ట్యంపూన్స్ వాడితే వర్జినిటీ పోతుంది

ఈ మాట ఎవరైనా మీతో అంటే, వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఏమి తెలియదు అని అర్ధం. సాధారణంగా అందరూ అనుకునే దాని ప్రకారం, మొదటి సారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు, కన్నెపోర తొలిగిపోతుంది, దాని వలన వర్జినిటీ పోతుంది. కానీ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, కన్నె పొర కేవలం సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే తొలిగిపోదు. మీరు ఏదైనా ఆటలాడుతూ లేదా సైకిల్ తొక్కుతూ పడిపోయినప్పుడు  కూడా  అలా జరుగుతుంది. అంతమాత్రాన మీరు వర్జినిటీ కోల్పోయినట్టు కాదు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ట్యంపూన్స్ వాడచ్చు.

6. పీరియడ్స్ సమయంలో పచ్చడిని ముట్టుకుంటే చెడిపోతుంది

మీ పీరియడ్స్ సమయంలో, మీరు పచ్చడిని తాకగానే మీ యోనిలో ఉండే మలినం అలా పైకి పాక్కుంటూ వచ్చి, మీ వేళ్ళ ద్వారా పచ్చడిలోకి వెళ్ళిపోతుంది, పచ్చడి చెడిపోతుంది. ఈ పిచ్చి పచ్చడి మాటలు అసలు నమ్మకండి. 

7.పీరియడ్స్ సమయంలో గుడిలోకి వెళ్ళకుడదు

ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో తెలీదు, కానీ భారత దేశంలో చాలా దగ్గర ఇది పాటించబడుతుంది. సర్వజగతిని సృష్టించిన దేవుడిని మనుషులు ఎలా మలినం చేస్తారు. ఇది మాతృత్వానికి మూలమైన ఆడవాళ్ళను కించపరచడమే. దీనికి వ్యతిరేకాకంగా చాలా చోట్ల ఉద్యమాలు చేస్తున్నారు. ఇది త్వరలో మారాలని కోరుకుందాం. 

మహిళలందరికీ SHARE చేయండి….ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ముందడుగు వేయండి… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon