Link copied!
Sign in / Sign up
9
Shares

పెంపుడు జంతువులు ఇంట్లో ఉండాలనుకుంటే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి : ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు..

కుక్క, పిల్లి, ఉడత, కుందేలు, మేక వంటి పెంపుడు జంతువులను ప్రస్తుతం చాలామంది తమ ఇళ్లలో తమ ఇంటి సభ్యులులాగా చూసుకుంటూ ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే ఇలా పెంపుడు జంతువులు మీతో పాటు పెంచుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులను సరిగ్గా పెంచుకునే అవగాహన లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకని ఈ జాగ్రత్తల గురించి తెలుసుకోండి..

పెంపుడు జంతువులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

- పెంపుడు జంతువులను ఇంట్లోని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా వాటి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి. ఎప్పుడు ఏ సమయానికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, వాటిని మీతో హ్యాపీగా ఉండేలా ఎలా మచ్చిక చేసుకోవాలి. పెంపుడు జంతువులను ఆరోగ్యంగా ఉంచేలా ఏం చేయాలో తప్పక తెలుసుకోవాలి. 

- పెంపుడు జంతువుల వద్ద క్రిములు ఎక్కువగా చేరుతుంటాయి కాబట్టి ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలకు కాస్త దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే వాటి నుండి క్రిములు చిన్నపిల్లలకు చేరే అవకాశం లేకపోలేదు. 

- మీ పిల్లలకు అలర్జీ, చర్మ సమస్యలు ఉంటే వారి దగ్గరకు వెళ్లనివ్వకండి. పిల్లలకు పెంపుడు జంతువుల పట్ల భయం ఉంటే వారిని దగ్గరకు రా, వీటితో ఆడుకో అంటూ బలవంతం చేయకూడదు. వారికీ ఇష్టంగా ఉంటేనే వాటితో స్నేహం చేయించాలి. 

 

 

- కొన్ని పెంపుడు జంతువులకు కొన్ని నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి టీకాలు, వ్యాక్సిన్ వంటివి అవసరం కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకోవాలి. 

- మీ ఇంట్లో పెంపుడు జంతువులున్నప్పుడు మీరు ఎక్కడికైనా చాలా రోజుల ప్రయాణానికి వెళ్తుంటే మీ పక్కింటి వాళ్లకు వాటిని చూసుకోమని చెప్పడం, వాటి ఆహారం గురించి చెప్పడం చేయాలి. 

- గర్భంతో ఉన్నప్పుడు, పసిపిల్లలు ఒంటరిగా నిద్రిస్తున్న చోటు పెంపుడు జంతువులను ఉంచకూడదు. ఎందుకంటే సూక్ష్మక్రిములు వీటి నుంచి వారికి త్వరగా వ్యాపించి అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. 

- కొందరికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం, ప్రేమ ఉంటుంది. కానీ వాటిని దగ్గరగా తీసుకున్నప్పుడు తుమ్ములు రావడం, దగ్గుతూ ఉండటం, వికారం, కడుపులో తిప్పినట్లుగా ఉంటే డాక్టర్ ను కలిసి ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి. 

- పెట్స్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలపై అవి ఎక్కువ ప్రేమను చూపిస్తూ, వారితో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి. అందుకని పిల్లలకు పెంపుడు జంతువులను ఎలా గౌరవించాలో నేర్పించాలి. పిల్లలు భయంగా పెట్స్ ను దూరం పెట్టినట్లయితే వాటి గోర్లతో పిల్లలపై దాడి చేస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీయవచ్చు. 

- రోజూ యాక్టివ్ గా ఉండే పెంపుడు జంతువులు ఉన్నట్లుండి కొన్నిసార్లు లేవకుండా ఒకేచోట నీరసంగా కూర్చుని ఉంటాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తుంటాయి. అందుకని ఇది అర్థం చేసుకుని వెంటనే పెంపుడు జంతువుల స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి. 

- మీ ఇంట్లో పెట్స్ కొన్నిసార్లు బయట జంతువులతో స్నేహం చేస్తూ ఉంటాయి అటువంటప్పుడు కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా వాటి దగ్గరకు తీసుకోవాలి. అలాంటప్పుడు వాటికి చాలా ఆనందంగా ఉంటుంది. 

- పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్ళేటప్పడు ఒంటరిగా వదిలివేయడం, మీరు వాటికి దూరంగా ఉండటం చేయకూడదు ఎందుకంటే బయట తిరిగే జంతువులు వాటిపై దాడి చేసే అవకాశాలు ఎక్కువ. పెట్స్ చాలా సున్నితంగా ఉండటం వలన వాటిని ఎదుర్కోలేవు. పెంపుడు జంతువులను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకుండా కాస్త బయట వాతావరణం అలవాటు చేయాలి. అలాగే అవి అప్పుడు క్లీన్ గా ఉండేలా ఎప్పుడు ఎలా స్నానం చేయించాలో ముందే తెలుసుకోవాలి. 

పెంపుడు జంతువుల పట్ల మీరు లేదా పిల్లలు అనారోగ్యానికి గురైతే ఎటువంటి చిట్కాలు పాటించాలో మరొక ఆర్టికల్ లో చెప్పుకుందాం. ఇదండీ పెంపుడు జంతువుల గురించి, ఈ అవగాహనలు ఉంటేనే పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకోండి. మీకు తెలియనప్పుడు మీరు బాధపడి, వాటిని బాధపెట్టకండి..

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

cover image source : wikimedia

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon