Link copied!
Sign in / Sign up
14
Shares

పెళ్లి తర్వాత ప్రతి దంపతులకు ఎదురయ్యే 5 పరిస్థితులు : మీకు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయోమో చూడండి

పెళ్లికి ముందు అమ్మాయికైనా, అబ్బాయికైనా ఎన్నో ఆశలుంటాయి. కలలు కంటారు. అఫ్ కోర్స్ – కొన్ని భయాలూ ఉంటాయి.  పెళ్లయ్యాక, లైఫ్ ను ఎలా లీడ్ చేయాలి...అని ప్లాన్ చేసుకుంటారు. నిజానికి పెళ్లి పిల్లలాట కాదు, వివాహం తర్వాత బాధ్యత పెరుగుతుంది. ఓ కొత్త వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశించారనే సంతోషంతో పాటు జీవితం పట్ల ఒక అంకిత భావం ఏర్పడుతుంది. ఒకరికొకరుగా ఉండాలనిపిస్తుంది. వీటితో పాటు కొత్త దంపతులకు పెళ్లి ఒక థ్రిల్. మొదటి ఏడాదిలో వారి లైఫ్ లో ఏడు దశలుంటాయి. అవి ఏంటంటే ....

 1. హనీమూన్

పెళ్లయ్యాక మొదటి ఏడాది ఆ దంపతులకు ఓ హనీమూన్ అని చెప్పవచ్చు. వివాహ జీవితంలో ఆ దశ మొదటిది, మధురమైంది. ఒకరికొకరు బాగా రొమాంటిక్ గా గడిపే టైం అది. మొదటి ఏడాది వారికి అంతా హ్యాపీగా, కొత్తగా అనిపిస్తుంది. భార్య ఏది చేసినా భర్తకు ఇష్టంగా, భర్త ఏది చెప్పినా వేదంగా అనిపిస్తుంది. ఒకరినొకరు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.

2. ప్రశ్నలూ – సలహాలు

నూతన దంపతులకు అందరూ సలహాలిస్తుంటారు. ప్రశ్నలూ వేస్తుంటారు. కొత్త దంపతులకు ఎదురయ్యే మొదటి ప్రశ్న. బాబు కావాలనా? పాప కావాలనా? ఎప్పుడనుకుంటున్నారు? అని. ఆ ప్రశ్న వినగానే భార్యాభర్తలకు సిగ్గు ముంచుకొస్తుంది. నవ్వొస్తుంది. ఎందరు ఎన్ని సలహాలు చెప్పినా కొన్నింటిని స్వీకరించవచ్చు.

3 గొడవలు- కొట్లాటలు

భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు పొగుడుకుంటూ, కలలు కంటూ, హ్యాపీగా ఉంటారనుకోకూడదు. వారి మధ్య అప్పుడప్పుడూ గిల్లి కజ్జాలు, ప్రణయ కలహాలూ కూడా వస్తుంటాయి. అసలు కాస్త చిలిపి తగాదాలు, గొడవలు లేకపోతే ప్రణయ జీవితంలో మాధుర్యం ఉండదు. గొడవ పడినా మళ్లీ అంతలోనే రాజీపడిపోతుంటారు కూడా. అప్పుడు సాన్నిహిత్యం పెరుగుతుంది.

4. అత్తింటి వారెలా ఉంటారంటే ....

పెళ్లి అంటే కేవలం ఓ మనిషిని వివాహం చేసుకోవడం కాదు...ఓ కుటుంబంతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం. పెళ్లయిన మొదటి ఏడాదిలో భర్తకు ఇది అనుభవమవుతుంది. భార్యాభర్తలు గొడవపడినప్పుడు అత్తమామలు ఎప్పుడూ తమ కూతురినే వెనకేసుకొస్తారు. అల్లుడిని వాళ్లకు అనుకూలంగా మలచుకోడానికి చూస్తారు.

5. శృంగార జీవితం

పెళ్లయిన మొదటి ఏడాది భార్యాభర్తల శృంగార జీవితం చాలా ఉన్నత దశలో ఉంటుంది. జీవిత భాగస్వామిని ఒకరికొకరు సంపూర్ణంగా విశ్వసిస్తారు. అందువల్ల పడకపై వారు మరింత సంతోషంగా గడుపుతారు. సరసాలాడుకుంటారు. సరసమైన కథలూ చెప్పుకుంటారు.

6. ఆచరణ లో డిఫరెంట్ గా....

పెళ్లికి ముందు ఏవేవో ప్లాన్స్ వేసుకుంటాం. తీర్మానాలు చేసుకుంటాం. కానీ పెళ్లయ్యాక అంతా మారిపోతుంది. అనుకున్నవన్నీ ఆచరణలోకి తీసుకు రాలేం. పెద్దవారిలా ప్రవర్తించడానికి ప్రయత్నించే చిన్న పిల్లాడిలా ఉంటుంది పరిస్థితి. అయోమయంగా ఉండే ఆ పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంటుంది.

7. అండదండలు

పెళ్లయిన మొదటి ఏడాది మనకు అండగా ఉండేందుకు ఓ మనిషి ఉన్నారనే ధైర్యం ఉంటుంది. ఎవరికైనా జీవిత భాగస్వామి నిజమైన ఫ్రెండ్. మన పనులు, మనకు సంబంధించిన అన్ని విషయాలు లైఫ్ పార్టనర్ చూసుకుంటారనే భావన ఎంతో తృప్తి నిస్తుంది. అయితే, జీవిత భాగస్వామి నుంచే వచ్చే మద్దతును పూర్తిగా ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని ఎడ్వాంటేజ్ గా తీసుకోకూడదు. భార్యాభర్తలు అవసరమైనప్పుడు ఒకరి మద్దతు ఒకరు తీసుకోవాలి కానీ పూర్తిగా ఆధారపడినట్టు కాదు.

పెళ్లి అయిన మొదటి ఏడాది మీకు కూడా ఇలా అనిపించి ఉంటే COMMENT చేయండి. అవును నిజం అనిపిస్తే SHARE చేయండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon