Link copied!
Sign in / Sign up
10
Shares

పెళ్లి కొడుకు గడ్డం గీసుకోలేదని పెళ్లి కూతురు పెళ్ళిలో ఏం చేసిందో చూడండి

ప్రజెంట్ చాలామంది అబ్బాయిలు, యువకులు ఎక్కువగా గడ్డంతోనే కనిపిస్తున్నారు. అదే ప్రస్తుతం ఫ్యాషన్ కూడా. ఆ గడ్డమే ఈ ఈ పెళ్లి కొడుకుకి ఇబ్బంది తెచ్చి పెట్టింది. పెళ్లి మండపంలోకి వచ్చిన పెళ్లి కొడుకు గడ్డంతో ఉండటం పెళ్లి కూతురు చూసింది. పెళ్లి కొడుకు గడ్డం గీసుకుని క్లీన్ గా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి మండపంలో మొండిగా కూర్చుని పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

పెళ్లి కొడుకు గడ్డం గీసుకుంటేనే పెళ్లి..

ఈ చిత్రంలో కనిపిస్తున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు మంగల్ సింగ్, రూపాలీ. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలోగల అయ్ గటీ గ్రామంలో వీరి ఇద్దరి పెళ్లిని పెద్దలు నిశ్చయించారు. ఐతే పెళ్లి రోజు పెళ్లి కొడుకు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి మండపానికి వచ్చాడు. ఆ సమయంలో పెళ్లి కొడుకు గడ్డంతో ఉండటం పెళ్లి కూతురు చూసింది. ముందు ఆ గడ్డం తీసివస్తేనే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు మొండిగా కూర్చుంది. ఆమె మాటలకు వారి బంధువులు కూడా అదే చెప్పారు. ఐతే పెళ్లి కొడుకు అతడి బంధుమిత్రులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వరుడు-వధువు బంధువుల మధ్య గడ్డం కోసం గొడవ మొదలైంది.

పోలీసులు పెళ్లి మండపంలోకి వచ్చారు

గడ్డం వలన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బంధువులు గొడవపడుతుండటంతో పెళ్లి మంటపంలో ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి అసలు విషయం తెలుసుకుని పెళ్లి కుమారుడికి నచ్చచెప్పి పంపించారు. ఈ గొడవ కారణంగా పెళ్లి ముహూర్తం దాటి పోవడంతో తర్వాత రోజు ముహూర్తం ఉండటంతో పెళ్లి జరిపించారు.

చూశారా.. ఒక చిన్న గడ్డం పెళ్లిని కొన్ని నిముషాలు ఆపివేసింది.  సో పెళ్లి చేసుకునే అబ్బాయిలు, అమ్మాయిలు ముందే ఇలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త పడండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon