Link copied!
Sign in / Sign up
17
Shares

పెళ్లి చేసుకున్న 11 ఏళ్ళ తర్వాత ఈ భార్యాభర్తలకు అసలు రహస్యం తెలిసింది : వీళ్ళ జీవితంలో జరిగిన మిరాకిల్ 😱😱

విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలుసుకోవడం, చెప్పడం చాలా కష్టం. అవును నేను చెబుతున్నది నిజమే అని మీరు  ఈ ఫోటో చూశాక అర్థం చేసుకుంటారు. అసలు ఈ ఫోటోలో ఏముంది అనే అనుమానం ఈ పాటికే మీకు వచ్చే ఉంటుంది. ఈ ఫోటో 11 ఏళ్ళ క్రితం జ్యు అనే మహిళ తీసుకున్న ఫోటో. ఆమె ఉన్న ఫోటోలో వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు ఆమె భర్త. అనుకోకుండా ఈ ఫోటో తీయించుకున్నప్పుడు వీరిద్దరికి అస్సలు పరిచయం లేదు.  మరి ఆ రహస్యం ఎలా బయటపడిందో మీరే చూడండి.

11 ఏళ్ళ తర్వాత అసలు విషయం

జ్యు తీయించుకున్న ఫోటో చైనాలోని మే ఫోర్ స్క్వేర్ అనే టూరిస్ట్ ప్లేస్. 11 ఏళ్ళప్పుడు ఈ ప్రాంతానికి వెళ్లగా అక్కడికి వెళ్లిన గుర్తుగా ఫోటో తీయించుకుంది. ఆమె వెనకాల ఉన్న వ్యక్తి పేరు యొ. ఆమె ఫోటో తీయించుకున్నప్పుడు ఆ ఫోటోలో అతడు కూడా ఉన్నాడు. సాధారణంగా ఫొటోలు తీసుకునేటప్పుడు మధ్యలో కొందరు వస్తూ ఉంటారు కదా. అలా అతను ఫోటోలో ఉన్నాడు. అనుకోకుండా ఇది జరిగింది. ఐతే కొన్నేళ్ల తర్వాత వీరికి పరిచయం అయ్యి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత తెలుసుకున్నారు..

అయితే రీసెంట్ గా తన భార్య ఫోటో ఆల్బమ్స్ ను యొ చూస్తుండగా జ్యు మే ఫోర్ స్క్వేర్ లో తీయించుకున్న ఫోటోలో తను కూడా ఉండటం చూశాడు. అరె మనం అప్పుడు ఎవరో ఒకరికిఒకరం పరిచయం లేకపోయినా భలే కలుసుకున్నాం చూడు అని భార్యకు చూపించగా ఆమె ఎంతో ఆనందపడింది. 11 ఏళ్ళ తర్వాత ఈ విషయం తెలియడంతో విధి మనల్ని ఎలా కలిపిందో చూడు అని సంతోషించారు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆ ప్రదేశాన్ని జంటగా వెళ్లి సందర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మరియు వీరి గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

ఇలా మీరు కూడా అనుకోకుండా తీయించుకున్న ఫోటోలో ఎవరైనా వచ్చారా, వారిని మీరు మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుని ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ జంటను అభినందించండి… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon