Link copied!
Sign in / Sign up
26
Shares

పెళ్ళి అయిన తరువాత దంపతులు మరచిపోయే 6 ముఖ్యమైన విషయాలు

పెళ్ళి అయిన మొదటి ఏడాది, మీ జీవితంలో మీరు మర్చిపోలేని ఒక మధురమైన సంవత్సరం. ప్రతి రోజు, ప్రతి నిమిషం సంతోషంతో, తప్పులను పట్టించుకోకుండా, ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనే ఉత్సాహంతో, గడిచిపోయిన ప్రతి క్షణం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కానీ సంవత్సరం గడిచే కొద్దీ,  అన్ని మాయమవుతాయి. తరువాత గుర్తులుగా, జ్ఞాపకాలుగా మిగులుతాయి. పెళ్ళైన మొదటి ఏడాది గురించి మీరు మిస్ అవుతున్న విషయాలేంటో చూడండి..

1. హనీ మూన్

పెళ్ళి అయిన తరువాత ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రదేశంలో, కొత్త జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఏ చీకు చింతా లేకుండా గడిచిపోయిన ఆ నాలుగు రోజులను ఇప్పుడు తలచుకున్నా, మనసంతా ఎక్కడో తేలిపోతుంది. తర్వాత ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఏ ట్రిప్ కి వెళ్ళినా, ఆ అనుభూతి మళ్ళి రాదు.

2. కొత్త పేరు

పెళ్ళి కాక ముందు గీత కాస్త పెళ్ళి అయిన తరువాత గీత సుబ్రహ్మణ్యం అయిపోతుంది. పెళ్ళి అయిన తరువాత, మీకు అప్పటి వరకు స్కూల్ లో , కాలేజీ లో వున్న ఇంటి పేరు కూడ మారిపోతుంది. పెళ్ళి అయిన కొత్తల్లో ఈ కొత్త పేర్లతో అందరు మిమ్మల్ని పిలవడం, మీకు కూడా కొత్తగా ఉంటుంది. తరువాత అలవాటు అయిపోతుంది.

3. కొత్త చుట్టాలు

మీ చిన్నపటి నుంచి, మీకు తెలిసిన బాబాయి, మామయ్య, అత్తలు, పెదనాన్న, పెద్దమ్మ వీళ్ళు మాత్రమే చుట్టాలు. కానీ పెళ్లి అయిన తరువాత చుట్టాల లిస్టు పెరుగుతుంది. పెళ్ళి అయిన మొదటి ఏడాది మొత్తం, ఎవరో ఒకరు కనిపించి, “నేను నీకు బాబాయి అవుతానమ్మా… “, నేను నీకు అత్త వరసలే, నీకు తెలీదు… “ అని పరిచయాలు చేసుకుంటూనే ఉంటారు.

4. మొగుడు - పెళ్ళాం

“ఇప్పుడు నాకొక భర్త ఉన్నాడు…. నేను ఆయన భార్యను “ పెళ్ళి అయిన కొత్తల్లో ఈ ఆలోచన ప్రతి సారి కొంచెం కలవరాన్ని, సంతోషాన్ని కలిగిస్తూనే ఉంటుంది. మీ ఇద్దరిని ఎవరైనా మొగుడు - పెళ్ళాం, పిలిచినా కొత్తగా ఫీల్ అవుతారు. ఈ ఫీలింగ్ తర్వాత పాత పడిపోతుంది.

5. పెళ్ళి గురించి చెప్పడం

పెళ్ళి అయిన మొదటి ఏడాది, మీ స్నేహితులు కలిసిన, పరిచయస్తులు కలిసిన,... అన్ని పెళ్ళి ముచ్చట్లే. మీరు కట్టుకున్న చీర జరీ అంచు, పెళ్ళి భోజనాలు, జరిగిన సరదా సంగతులు , ఇలా అన్ని ఇంట్రస్టింగ్ విషయాలే. కానీ ఏడాది గడిచే కొద్ది అన్ని పాతబడిపోతాయి, మీకు కూడా ఇంట్రస్ట్ పోతుంది.

6. మొదటి పెళ్ళి రోజు

మీ మొదటి పెళ్ళి రోజు, మీకే తెలియకుండా వచ్చేస్తుంది. అప్పుడే పెళ్ళి అయ్యి ఏడాది అయిపోయిందా అనిపిస్తుంది. పెళ్ళై ఏడాది అయిపోయినందుకు సంతోషం, అప్పుడే అయిపోయిందా అనే వెలితి... ఆ రోజును మర్చిపోలేని జ్ఞాపకంగా మిగులుస్తాయి.

ఇది చదివిన తరువాత మీకు పెళ్ళి అయిన మొదటి ఏడాది గుర్తొచ్చింది కదూ… ఆలస్యం చేయకుండా మీ ఆయనకు SHARE చేసి తనకు కూడా ఆ జ్ఞాపకాలను గుర్తు చేయండి…

ఇవి కూడా చదవండి

ప్రతి భార్య తన భర్తకు తప్పకుండా చెప్పాల్సిన 7 విషయాలు

మీ భర్తతో ఎప్పుడు అనకూడని 5 మాటలు

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon