Link copied!
Sign in / Sign up
42
Shares

పెళ్ళి అయిన తర్వాత పుట్టింటి గురించి అందరూ మిస్సయ్యే 4 విషయాలు

పెళ్ళి అయిన తర్వాత పుట్టింటిని వదిలి వెళ్ళాల్సిరావడం అందరికి జరిగేదే. పెళ్ళైన ప్రతి అమ్మాయి  ఈ బాధను అనుభవించాల్సిందే.  మీ ఇంటితో మీకు చాలా అనుబంధం ఉంటుంది. చిన్నప్పటి నుండి ఆ ఇంటిలోనే ఉంటారు, మీకు బాధలు, ఆనందాలు అన్ని ఆ ఇంటిలోనే జరిగుంటాయి.  ఇలా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఆ ఇంటితోనే ముడిపడి ఉంటుంది. అయితే అలాంటి పుటింటిని వదిలివెళ్ళడం నిజంగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే విషయమే. మీరు మీ పుట్టింటిని వదిలి వెళ్ళిన తర్వాత మిస్ అయ్యే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే

అమ్మచేతి వంట

మీకు పెళ్ళి అయిన తర్వాత బాగా మిస్ అయ్యే వాటిలో అమ్మచేతి వంట మొదటిది. ఎన్నోసార్లు మీరు ఆకలిగా ఉన్నప్పుడు అమృతం లాంటి ఆహారాన్ని తెచ్చి మీ ఆకలి తీర్చిన అమ్మచేతి వంట ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. ఒకసారి మీరు కిచెన్‌లోకి వెళ్ళి వంట మొదలు పెడితే, మీ అమ్మ పడిన శ్రమ మరింత గుర్తుకొస్తుంది.

నిద్ర

మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నిద్ర లేవచ్చు, మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ కూడా చేయరు, మీరు లేచిన వెంటనే మీకు బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంటుంది. అయితే మీకు పెళ్ళి అయిన తర్వాత అంతా మారిపోతుంది. మీరు ముందుగా లేచి అందరికి టిఫెన్ రెడీ చేసి, ఇంటి సభ్యులను లేపి అందరికి సపర్యలు చేయాలి. అందుకే అందరికన్నా ముందు నిద్రలేవాలి.

తోడబుట్టినవాళ్ళు

మీకు పెళ్ళి అయిన తర్వాత మీకు పేరెంట్స్ తర్వాత గుర్తొచ్చే వాళ్ళు మీ సిబ్లింగ్స్. ఎందుకంటే, మీరు గడిపిన ఎన్నో సంఘటనలు వారితోనే ముడిపడి ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు ఎప్పుడూ టీజ్ చేసుకుంటూ ఉంటారు, కలిసి ఆడుకుని ఉంటారు, కోప్పడి ఉంటారు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసి ఉంటారు. ఇలాంటివి గుర్తు వచ్చినప్పుడు మీరు బాగా ఏమోషన్ అవచ్చు.

నాన్న

సాధారణంగా ప్రతి నాన్నకు తన కూతురిపై అపారమైన ప్రేమ, నమ్మకం ఉంటాయి. బయటికి చెప్పలేనప్పటికీ మనకు తెలిసే ఉంటాయి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ నాన్నచెప్పిన మాటలు, ఇచ్చిన ప్రేరణను గుర్తొస్తాయి.

ఇంటిపని

మీరు పుట్టింట్లో ఉన్నప్పుడు చాలా తక్కువ పని చేసి ఉంటారు. ఒకసారి మీకు పెళ్ళి అయిన తర్వాత మీ ఇంటిలో ప్రతి పనినీ మీరే చేసుకోవాలి. బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం. ఇంట్లో ఉన్నప్పుడు ఇవేవీ లేవనే భావన కలుగుతుంది.

ఖర్చులు

మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఖర్చు చేసి ఉంటారు. అయితే మీకు పెళ్ళి అయిన తర్వాత బాధ్యత అంటే ఎంటో తెలిసివస్తుంది. దేనికి ఎంత ఖర్చు చేయాలో, దేనికి ఎంత ఖర్చు చేయకుడదో వంటి విషయాలు అనుభవం ప్రకారం మీకు తెలుస్తాయి. అప్పుడు అమ్మ బాధ్యత గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి బావోధ్వేగానికి లోనవుతారు.

మిమ్మల్ని మీరు మిస్ అవుతారు

మీరు పుట్టింట్లో ఉన్నప్పుడు చాలా ఇండిపెండెంట్‌గా  ఉండేవారు. మీకు నచ్చిన పనులు చేస్తూ చాలా మందికి ఆదర్శంగా ఉండి ఉంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత చాలా కారణాల వలన మీ అభిరుచులు, మీ ఇష్టాలు, మీ ఆలోచనలు, మీ భావాలు ,అన్ని మీ కుటుంబం కోసం త్యాగం చేయాల్సి రావచ్చు.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon