Link copied!
Sign in / Sign up
7
Shares

పట్టుచీరలు ఎలా ఉతకాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!!

మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం పట్టుచీరలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్ కు వెళ్తున్నప్పుడు మహిళలు ఎంతో ఇష్టంగా, గౌరవ ప్రదంగా ఉండటానికి పట్టుచీరలను ధరిస్తారు. పట్టుచీరలు ధరించడం వలన మహిళలు అందం మరింత పెరిగినట్లుగా అనిపిస్తుంది, ఈ దుస్తులలో బాగా కళకళలాడుతూ ఉంటారు. అయితే ఈ పట్టుచీరలను శుభ్రంగా ఉంచుకోవడం, వాటిని ఎలా ఉతకాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మహిళకు ఈ విషయాలు చాలా అవసరం కాబట్టి అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు..

నిమ్మరసం

పట్టుచీరను ఉతకాలి అనుకున్నప్పుడు ఒక బకెట్ నీటిలో నిమ్మరసం కలిపి ఉతకడం వలన పట్టుచీరలపై ఉన్న మురికి దూరం అవుతుంది. గోరువెచ్చని నీరు ఉపయోగించవచ్చని నిపుణులు మరియు మహిళలు సూచిస్తున్నారు. కొంత మోతాదులో కాకుండా కాస్త ఎక్కువ మొత్తంలో నిమ్మరసం ఉపయోగించాలి.

బీరువాలో అలాగే పెట్టేవారు

పండుగలప్పుడు మరియు పెళ్లిళ్ల సమయంలో తప్ప పట్టుచీరలను మహిళలు సాధారణంగా ధరించరు. మిగతా సమయాలలో వాటిని భద్రంగా బీరువాలలో ఉంచుతారు. అయితే ఎప్పుడు బీరువాలలోనే ఉంచకుండా ఆరు నెలలకు ఒకసారి బయటకు గాసి కాస్త గాలి తగిలేలా బయట నీడలో ఆరివేయటం మంచిది. ఇలా చేయడం వలన పట్టుచీరల మెరుపు తగ్గదు మరియు చీర మడతలలో చిరుగులు పట్టకుండా అందంగా ఉంటాయి.

పట్టుచీర ఉతికేటప్పుడు

పట్టుచీరలను ఉతికేటప్పుడు ఎక్కువగా సాఫ్ట్ గా ఉన్నటువంటి నీటితో ఉంచడం మంచిది. ఉప్పుగా ఉండే కఠినజలం వాడటం వలన పట్టుచీరలలో మెరుపు తగ్గిపోతుంది. ఒకవేళ మీరు కఠినజలం వాడుతున్నట్లయితే అందులో కొంచెం అమ్మోనియం లేదా బోరాక్స్ కలపడం వలన నీరు మృదువుగా కావడానికి ఉపయోగపడుతుంది.

నూనె పడితే..

పట్టుచీరలు ధరించి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు నూనె గానీ, నెయ్యి గానీ ఆ దుస్తులపై పడినట్లయితే వెంటనే మైదాపిండి లేదా టాల్కమ్ పౌడర్ ను అక్కడ చల్లాలి. ఇలా చేయడం వలన నూనె, నెయ్యిని త్వరగా పీల్చివేస్తుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో  మరీ ఎక్కువగా ఉండే డిటర్జెంట్స్ సోప్స్ వాడకుండా ఉతకాలి.

ఇంకా పట్టుచీరల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలుపవచ్చు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon