Link copied!
Sign in / Sign up
21
Shares

పసుపుతో మహిళల అందాన్ని 5 నిముషాల్లో పెంచుకునే అద్భుత ఇంటి చిట్కాలు

మనదేశంలో కొన్నివేల సంవత్సరాల నుండి పసుపును ప్రతి శుభకార్యంలోనూ, ఔషధాలలో మరియు  సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.  ప్రతి ఇంట్లోనూ ఉండే పసుపును మహిళల అందాన్ని పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.. 

మీ చర్మం కాంతివంతంగా ఉండాలంటే

ప్రతి రోజూ స్నానానికి 30 నిముషాల ముందు శరీరానికి పసుపు రాసుకుని ఆ తర్వాత స్నానం చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ఉదయం స్నానానికి ముందు నువ్వుల నూనె, సున్నిపిండిలో పసుపు కలుపుకుని శరీరంపై రాసుకుని స్నానం చేయడం వలన చర్మం ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా మీ శరీరానికి వ్యాధులు సోకవు.

మొటిమలు పోవడానికి ..

ముఖంపై మొటిమలు మరియు నల్లని మచ్చలతో చాలామంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి, రెండు స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ముల్తాన్ మట్టి, రోజ్ వాటర్ మరియు ఒక స్పూన్ పసుపు కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్ గా వేసుకుని 15 నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే చాలు.

చర్మ వ్యాధులు

మహిళలు అందరితో బయటకు చెప్పుకోలేని చర్మ వ్యాధులు (దురద, మంట, తామర, గజ్జి..) తగ్గడానికి వేపాకును మెత్తగా దంచుకుని అందులో పసుపు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మ వ్యాధులపై రాసుకోవడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

సున్నితమైన చర్మానికి ఫేస్ ప్యాక్

కొందరి మహిళలలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, ఎవరైనా టచ్ చేసినా ఎర్రగా కందిపోవడం లేదా అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటివారు ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు 2 స్పూన్ల ముల్తాన్ మట్టి, ఒక స్పూన్ పెరుగు, అర స్పూన్ అలోవెరా జెల్ మరియు పసుపు కలుపుకుని బాగా మిక్స్ చేయాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న 15 నిముషాలు తర్వాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. మీ ముఖంపై అలర్జీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం ఉత్తమం.

రుతుక్రమం కడుపునొప్పి తగ్గడానికి

మహిళలను వేధించే సమస్యలలో పీరియడ్స్ ఒకటి. ఈ సమయంలో కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, కాబట్టి దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని సేవించడం వలన ఉపశమనం కలుగుతుంది మరియు ఎటువంటి వ్యాధులు సోకకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ అందమైన చిట్కాలను ప్రతి మహిళకు చేరేలా SHARE చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon