Link copied!
Sign in / Sign up
24
Shares

పసిపిల్లలలో తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్ గుర్తుపట్టడానికి సులభమైన 6 మార్గాలు

పసిపిల్లలకు చెవి ఇన్ఫెక్షన్‘లు సహజంగా వస్తుంటాయి. 6-24 నెలల వయసులో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్నానం చేయించాక నీరు చెవిలోనే ఉండిపోవడం వలన చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇంఫెక్షన్ ను ముందే గుర్తించి డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లకపోతే  పరిస్థితి విషమం కావచ్చు. ఇన్ఫెక్షన్ ఉన్నపుడు జలుబు చేస్తే చెవి మధ్య భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబ్ (eustachian tube) వాచిపోతుంది. పిల్లలకు చెవిలో మంటగా ఉంటుంది. పిల్లలకు ఈ వయసులో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమస్య వేరే తీవ్రమైన అనారోగ్యాలకు దారి  తీయచ్చు. అందుకే వాటిని వెంటనే గుర్తించాలి. ఈ సులభమైన 6 మార్గాల ద్వారా పసిపిల్లలలో చెవి ఇన్ఫెక్షన్లను వెంటనే గుర్తించవచ్చు….

1. సరిగా తినక పోవడం

చెవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, పిల్లలు ఏది తినడానికి ఇష్టపడరు. ఇన్ఫెక్షన్ వలన చెవిలో వాపు వస్తుంది. దాని వలన ఆహారం మింగడం చాలా కష్టంగా, నొప్పిగా ఉంటుంది. పిల్లలు ఆహారం సరిగా తినకపోతే చెవి ఇన్ఫెక్షన్ ఉందేమో చెక్ చేయండి.

2.చెవిలో నుంచి ద్రవాలు కారుతుంటాయి

మీ పిల్లల చెవిలో నుంచి తెలుపు లేదా పసుపు రంగులో ద్రవాలు కారుతుంటే తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి.

3.చెవి నుంచి చెడు వాసన వస్తుంది

పిల్లలలకు చెవిలో తీవరమైన ఇన్ఫెక్షన్ చేసినప్పుడు. చెవి లో కారే చీము వలన  చెడు  వాసన వస్తుంది. గమనిస్తుండండి, అలా జరిగితే చెవి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు.

4.సరిగా నిద్రపోరు

పిల్లలకు చెవిలో ఇన్ఫెక్షన్ చేసినప్పుడు చెవిలో చాలా నొప్పిగా ఉంటుంది. దాని వలన నిద్రపోకుండా ఏడుస్తూనే వుంటారు. అలా రోజు జరుగుతుంటే  చెవి ఇన్ఫెక్షన్ కోసం చెక్ చేయండి.

5.చెవులను వొత్తుకుంటున్నారా

పిల్లలలకు చెవి ఇన్ఫెక్షన్ చేసినప్పుడు నొప్పిగా  ఉంటుంది.  దాని వలన ఊరికే చెవిని తాకడానికి ప్రయత్నిస్తారు,  చెవులను వొత్తుకుంటుంటారు. ఇది చెవి ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఒక సూచన.

6.వాంతులు, విరోచనాలు

చెవి ఇన్ఫెక్షన్ చేసినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడం వలన, ఆహారాన్ని నమలకుండా మింగేస్తారు. దీని వలన వచ్చే అరుగుదల సమస్యతో విరోచనాలు, వాంతులు అవుతుంటాయి. అలా జరిగినప్పుడు చెవి ఇన్ఫెక్షన్ ఉందేమో చెక్ చేయండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon