Link copied!
Sign in / Sign up
18
Shares

పసిపిల్లలలో డైపర్ వలన ఏర్పడే దద్దుర్లను నయం చేయడానికి 4 సహజ మార్గాలు

పసిపిల్లలు ఉండే ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులలో చాలా ముఖ్యమైనవి డైపర్లు. పసి పిల్లల మలమూత్ర  విసర్జనను సులభం చేస్తాయి. కానీ ఇందులో కూడా ఒక సమస్య వుంది, పసిపిల్లలకు డైపర్లు వాడడం వలన వచ్చే దద్దుర్లు. డైపర్లు ద్వారా దద్దుర్లు రావడానికి కారణం కాండిడా (candida) అనే ఈస్ట్. డైపర్ల వలన ఏర్పడే దద్దుర్లను డైపర్ రాష్ (Daiper Rash) లేదా డైపర్ డెర్మటైటిస్ (Daiper Dermatitis). ఈ దద్దుర్లు మంట పుట్టినప్పుడు లేదా వాటికి ఏదైనా తగిలినప్పుడు, పిల్లలు చాలా బాధతో తీవ్రంగా ఏడుస్తారు. మీకు కూడా ఏ అర్ధరాత్రో పిల్లలు ఏడవడం వారిని మీరు ఓదార్చడం చాలా కష్టంగా ఉంటుంది. 

ఈ దద్దుర్లను ఎలా నయం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….

1. శుభ్రత

పిల్లలకు డైపర్ వేసేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన మొదటి విషయం, శుభ్రత. పాడైన డైపర్ తీసేసి కొత్త డైపర్ వేస్తున్నప్పుడు, డైపర్ వేసే ప్రాంతాన్ని శుభ్రం చేసి, పొడి బట్టతో తుడిచి తర్వాత కొత్త డైపర్ వేయాలి. డైపర్ వేసే ప్రాంతంలో తడి లేకుండా చూసుకోండి. ఒకవేళ తడి ఉంటే దానివలన ఈస్ట్ ఏర్పడుతుంది, దద్దుర్లకు కారణం అవుతుంది. 

2. మార్చండి

పిల్లల డైపర్లు తడి అయిన వెంటనే మార్చండానికి ప్రయత్నించండి. లేదా తడి ఎక్కువ సేపు ఉండడం వలన దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

3. కాసేపు అలా

రోజంతా డైపర్లు వేసి ఉండడం వలన, చమట కారణంగా దద్దుర్లు ఏర్పడుతాయి. అలా కాకుండా రోజులో కొంత సమయం ఏమి వేయకుండా అలానే ఏదైనా శుభ్రమైన బట్ట మీద ఉంచండి.

4. చేతులు కడగండి

పిల్లలకు డైపర్ వేసేటప్పుడు, మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి. మీ చేతులలో వుండే బాక్టీరియా మీరు డైపర్ వేసేటప్పుడు మీ పిల్లలకు చేరుతుంది. దానివలన దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. ఇవి వాడండి

మీరు పిల్లలకు డైపర్లు వాడుతున్నటైతే, తడి పీల్చుకునే డైపర్లు వాడడం మంచిది. ఒకవేళ మీరు తడి అయిన వెంటనే డైపర్ మార్చలేకపోయిన, అది తడిని పీల్చుకుంటుంది.

6. క్రీములు

డైపర్ల వలన వచ్చే దద్దుర్లను నయం చేయడానికి మార్కెట్ లో అనేకమైన డైపర్ రాష్ క్రీమ్స్ అందుబాటులో వున్నాయి. ఎవరైనా డాక్టర్ ను కలిసి వారి సలహా మేరకు ఏదైనా రాష్ క్రీమును వాడడం మంచిది.

7. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో అనేకమైన ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. దీనిని దద్దుర్లు ఉన్న ప్రాంతంలో రోజు రాయండి. పిల్లలకు మంట నుండి ఉపశమనం ఇస్తుంది, దద్దుర్లు కూడా తగ్గుతాయి.

8. టిష్యూస్ వద్దు

చాలా మంది పిల్లలకు తుడవడానికి టిష్యూస్ వాడుతారు. రాష్ వచ్చినప్పుడు వాటిని వాడకపోవడం మంచిది. అవి గుచ్చుకుని పిల్లలకు ఇంకా బాధ కలుగుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon