Link copied!
Sign in / Sign up
60
Shares

పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు మీరు చేసే 5 తప్పులు

పసిపిల్లల విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదైనా తప్పు జరుగుతుందేమో అని భయపడుతుంటాం. వారికి స్నానం చేయించేటప్పుడు ఆ జాగ్రత్త, భయం ఇంకాస్త అవసరం. పసిపిల్లల చర్మం చాల సున్నితంగా ఉంటుంది. క్రిములు సోకి, చాలా సులభంగా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం వుంది. అందుకే వాళ్ళను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. కానీ స్నానం చేయించే పద్దతిలో ఏవైనా తప్పులుంటె, అవి ఇతర సమస్యలకు దారి తీసే ప్రమాదంవుంది. అలాంటి 5 తప్పులు…..

1.మొదటి స్నానం చేయించేటప్పుడు చేసే తప్పు

బిడ్డ కడుపులోంచి బయటకు వచ్చిన వెంటనే స్నానం చేయించకూడదు. అప్పుడే పుట్టిన పిల్లలకు, వెర్నిక్స్ కాసియోసా (Vernix caseosa) అనే మైనం లాంటి పదార్ధం శరీరం మొత్తం పూతల ఉంటుంది. వెర్నిక్స్ పసికందుకి హాని కలిగించే క్రిములు, హానికరమైన బయట వాతావరణం నుంచి కొన్ని గంటల వరకు రక్షణ ఇస్తుంది. వెర్నిక్స్ ను 6 గంటలవరకు అలానే ఉంచి తర్వాత స్నానం చేయించాలి.

2.ఎన్ని సార్లు స్నానం చేయిస్తున్నారు

పసిపిల్లల చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. మరి ఎక్కువ సార్లు అదేపనిగా స్నానం చేయించకూడదు. వారానికి 3-4 నాలుగు సార్లు చేయించాలి. స్నానం చేయించాక తడి తుడవడానికి మెత్తగా వుండే టవల్స్ వాడాలి. స్నానం రాత్రిపూట చేయించడం మంచిది.

3.ఎలాంటి సబ్బులు వాడుతున్నారు?

ఇప్పుడు మార్కెట్లో పసిపిల్లలకు సంబంధించిన అనేక రకాల బేబీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. షాపింగ్ కి వెళ్లిన ప్రతి సారి ఉత్సాహం తో నానా రకాల సబ్బులు,షాంపులు కొని వాటిని పసిపిల్లకు వాడడం మంచిది కాదు. ఎప్పుడు కూడా మీకు నచ్చిన, ఒక బ్రాండ్ ఎంచుకొండి. ప్రతి సారి మార్చకుండా వాటినే కొనసాగించే ప్రయత్నం చేయండి. ఎలాంటి వాటిని ఎంచుకోవాలి అనే విషయం మీద అనుమానాలుంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

4.గోరువెచ్చని నీరు వాడుతున్నారా?

పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఎప్పుడైనా గోరువెచ్చని నీరు  మాత్రమే వాడాలి. మరీ చెల్లని లేదా వేడి నీరు వాడడం మంచిది కాదు. చర్మం పై దొద్దులు, రాషెస్ లాంటివి వచ్చే ప్రమాదం వుంది.

5.బొడ్డు దగ్గర జాగ్రత్తగా వున్నారా ?

పుట్టిన పిల్లలకు బొడ్డుతాడు ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా సున్నితంగా వ్యవహరించాలి. బొడ్డు తాడు ఎండి రాలిపోయెంతవరకు ఆ ప్రాంతంలో బలంగా రుద్దడం చేయకూడదు. స్నానం చేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon