Link copied!
Sign in / Sign up
7
Shares

పసిపిల్లల తల ఎగుడుతిగుడు లేకుండా గుండ్రంగా ఉండాలంటే, మీరు చేయాల్సిన 4 పనులు


పిల్లలు పుట్టిన తరువాత వారి ఆహరం నుండి ఆహార్యం వరకు అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటాం. వారికి ఏదైనా అవుతుందేమో అని ఆందోళన చెందుతుంటాం. కానీ చాలా మంది తల్లి తండ్రులు పసి పిల్లల విషయంలో పట్టించుకోని విషయం ఒకటి వుంది. అదే తల ఒక వైపుగా అనిగి పోవడం, సొట్ట పోవడం. దేనినే వైద్య పరిభాషలో ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ (Flat head syndrome) అంటారు. పసి బిడ్డలు ఎప్పుడు ఒక వైపే తలను ఆనించి పడుకోవడం వలన ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి మీరు చేయాల్సినవి ఇవి…


1. మారుస్తూ ఉండాలి

పసి పిల్లలు కొంత ఎదిగే వరకు, తలను పూర్తిగా అటు ఇటు తిప్పలేరు. మీరు ఎటు వైపైతే పడుకో పెడుతారో అటు వైపే తలను ఉంచుతారు. అలా ఒక వైపే తలను ఎక్కువ సేపు ఆనించడం వలన ఒక వైపు తల చదునుగా అయిపోతుంది. అందుకే పిల్లలను పడుకోపెట్టిన తరువాత, తలను కొంత సమయానికి అటు ఇటు మారుస్తూ ఉండండి.

2. రూమ్ ఇలా ఉండాలి

పిల్లలు వస్తువులను, మనుషలను గమనించడం మొదలు పెట్టాక, పిల్లలను పడుకోపెట్టే రూమును మీరు కొంచెం మార్చాల్సి ఉంటుంది. పిల్లలు ఏదైనా కనిపిస్తే దాన్నే అలానే చూస్తూ ఉండి పోతారు. తల ఒక పక్కకు ఉండిపోతుంది. అందుకే పిల్లలు ఉండే రూములో చుట్టూ వస్తువులు లేదా పోస్టర్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడు వాటిని చూడడానికి తలను అటు ఇటు తిప్పుతారు.

3. పొట్ట మీద

పిల్లలు కొంత వయసు వచ్చాక పొట్ట మీద పడుకోవడం నేర్చుకుంటారు. కానీ కొన్ని సార్లు కష్టమైనప్పుడు తిరిగి మళ్ళి తల ఆనించి పడుకుంటారు. ఇలా జరగనివ్వకుండా, పిల్లలు పొట్ట మీద పడుకోవడం అలవాటు చేయండి.

4. సహాయం తీసుకోండి

ఒకవేళ పిల్లలకు తల ఒక వైపుగా చదునవ్వడం జరిగితే, మీరు కంగారు పడద్దు. అది నయం చేయతగినదే. ముందు మీరు డాక్టర్ ను కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon