Link copied!
Sign in / Sign up
1
Shares

చంటి బిడ్డలను బయటకు తీసుకువెళ్ళేటప్పుడు ఈ 4 జాగ్రత్తలు తీసుకోండి

బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో శిశువుకు కొంత రిలాక్సేషన్ కూడా కావాలి. బిడ్డను బయటికి తీసుకెళ్లే విషయంలో వైద్యరంగంలోనే కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి.

పుట్టిన తర్వాత 6 నుంచి 8 వారాలలోపు ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లడం ఆరోగ్యపరంగా మంచిది కాదని కొన్ని వర్గాలంటున్నాయి. పాపకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కనుక బయటకు తీసుకెడితే ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఏదైనా వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన రెండు నెలల వరకూ బిడ్డను బయటికి తీసుకెళ్లక పోవడమే మంచిదని కొందరంటారు. కొందరు మరేం ఫరవాలేదని చెబుతున్నారు.

ఇలా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి కనుక, ఒకవేళ బిడ్డను బయటికి తీసుకెళ్లాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

1.వేడి తగలకుండా

బిడ్డకు వేడి తగలకుండా, ఎండ వేడి ఎక్కువగా పడకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి కానీ, వేడి కానీ తగిలితే, భవిష్యత్తులో స్కిన్ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

2. ఎక్కువ చల్లగా 

ఎక్కువ చల్లగా లేదా ఎక్కువ వేడి వాతావరణం ఉన్న చోటికి బిడ్డను తీసుకెళ్లకూడదు. విపరీత వాతావరణ పరిస్థితుల్ని ఆ బిడ్డ లేత చర్మం తట్టుకోలేదు.

3. దుస్తులు 

బేబీకి వేసే దుస్తులు కూడా అనువుగా ఉండాలి. మందంగా, బిగుతుగా ఉండే ఎక్కువ బట్టలు వేయకూడదు. అందువల్ల చెమట పడుతుంది. చికాకు పెడుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగని అసలు బట్టలు లేకుండా ఉంచకూడదు. బయటి వాతావరణం వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా ఆ ప్రభావం పాపమీద పడుతుంది. వేడి ఎక్కువైతే చర్మం బొబ్బలెక్కి మంట పుడుతుంది. చల్లగా ఉంటే జలుబు చేస్తుంది.

4. వాతావరణం 

చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాంతంలో ఫ్లూ జ్వరాలుంటే బిడ్డను ఇంట్లో ఉంచడమే మంచిది.

5. దుప్పటి

తలిదండ్రులు బిడ్డతో బయటికి వెళ్లినప్పుడు వాతావరణం హఠాత్తుగా మారిపోవచ్చు.  కాబట్టి ముందు జాగ్రత్తగా దుప్పటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అందువల్ల ఎండ నుంచి లేదా తేమ గాలి నుంచి బిడ్డకు రక్షణ కల్పించవచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon