Link copied!
Sign in / Sign up
17
Shares

పసిపిల్లలలో వాంతులు, విరేచనాలు (డయేరియా) తగ్గడానికి ఉత్తమ చిట్కాలు


పిల్లలలో 5 ఏళ్ళ వరకు వాంతులు, విరేచనాలు అనేవి సర్వసాధారణమే. మొదట వాంతులతో మొదలై రెండో రోజు నుండి విరేచనాలు రావడం, మళ్ళీ వాంతులు రావడం..ఇలా 4 నుండి 5 రోజుల పాటు వాంతులు, విరేచనాలు పిల్లలను ఇబ్బందిపెడుతూ ఉంటాయి. తల్లితండ్రులు చాలా కంగారుపడిపోతూ ఉంటారు.  పిల్లలలో జీర్ణాశయం లోపలి పొర గోడలు, పై పేగుల పొర దెబ్బ తినటం వలన ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఐతే పసిపిల్లలలో విరేచనాలు తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

పిల్లలలో విరేచనాలు ఎందుకు వస్తాయి..?

పెద్దవారితో పోల్చితే పసిపిల్లలలో విరేచనాలు ఎక్కువగా కావడానికి కారణం వైరస్ లేదా బాక్టీరియా. అలాగే పిల్లల రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటం వలన పిల్లల శరీరం అతిసార వ్యాధికి వెంటనే గురవుతుంది. ముఖ్యంగా మీ పిల్లలను తాకేటప్పుడు చేతులు శుభ్రంగా లేకపోవడం, మంచి నీరు శుభ్రంగా లేకపోవడం, పిల్లల చుట్టూ పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం పసిపిల్లలలో వాంతులు, విరేచనాలు త్వరగా కలిగిస్తాయి.

ఓఆర్ఎస్

పిల్లలలో విరేచనాలు తరచూ అవుతుంటే ఓఆర్ఎస్ ద్రవం చాలా బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విరేచనాలు అయిన తర్వాత ఓఆర్ఎస్ పిల్లలతో తాగించడం వలన విరేచనాలు అదుపులోకి వస్తాయి.

నీరు, ఉప్పు, పంచదార

పిల్లలకు ఇచ్చేనీరు ఎప్పుడు గోరువెచ్చగా చేసి చల్లారిన తర్వాత ఇవ్వడం మంచిది. అలాగే డయేరియా సమస్య ఉన్నప్పుడు నీరు గోరు వెచ్చగా చేసి చల్లారిన తర్వాత అందులో కాస్త ఉప్పు మరియు పంచదార కలిపి ఇవ్వడం వలన పిల్లల ఆరోగ్యం బలహీనపడకుండా త్వరగా శక్తిని తెచ్చుకోగలరు.

సగ్గుజావ, పెరుగు

విరేచనాల సమస్య అధికంగా ఉన్నప్పుడు సగ్గుజావ, మజ్జిగ, కొబ్బరి నీరు ఇవ్వడం వలన జీర్ణాశయం లోపలి పొరలను కంట్రోల్ చేస్తాయి. అందుకని పెరుగులో కాస్త జీలకర్ర పొడిని కలిపి ఇవ్వడం గానీ, ఉప్పు లేదా చక్కర కలిపి ఇవ్వడం వలన నీళ్ల విరేచనాలు తగ్గుముఖం పడతాయి.

మందులు వాడకపోవడం మంచిది

పిల్లలు తరచూ ఇలా అతిసార వ్యాధితో బాధపడుతూ ఉంటే కొన్ని యాంటీబయాటిక్స్ మందులు వాడుతూ ఉంటారు. ఇవి పిల్లలకు చాలా చేదుగా ఉండటం వలన వెంటనే బయటకు కక్కివేయడం చేస్తుంటారు. అందుకని యాంటీబయాటిక్స్ మందులను ఒక్కరోజు వాడకపోవడం మంచిది. 36 గంటలు లేదా 48 గంటల పాటు పిల్లలలో ఇలాగే ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చేయాలి.

సగ్గుబియ్యం

పిల్లలలో నీళ్ల విరేచనాలు తగ్గడానికి సగ్గుబియ్యం ఉత్తమ చిట్కాగా చెప్పుకోవచ్చు. ఒక గంట లేదా అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మంచి నీటిని సగ్గుబియ్యంను ఉడికించడానికి తగినన్ని తీసుకోవాలి. ఇందులో కాస్త చక్కర కూడా కలుపుకోవచ్చు. సగ్గుబియ్యం బాగా ఉ డికిన తర్వాత చల్లార్చి పిల్లలకు పట్టించాలి.

మీకు కూడా దీనికి సంబంధించి ఏవైనా చిట్కాలు తెలిసి ఉంటే ఈ ఆర్టికల్ SHARE చేసి మీ COMMENT పోస్ట్ చేయవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon