Link copied!
Sign in / Sign up
19
Shares

పసి పిల్లల తలకు బొప్పి కట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పసి పిల్లలు నిరంతరం ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. మొదట పాకడం తరువాత నడవడం వంటివి.  కానీ ఈ క్రమంలో దెబ్బలు తగులుతాయని మనం vవారిని ఆపకూడదు. ఎందుకంటే దెబ్బలు తగలడం అనేది ఎదుగుదల క్రమంలో ఒక భాగం అని మనం గుర్తించాలి. అలాగే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

బెడ్ నుంచి లేదా కుర్చీ మీద నుంచి కిందపడి దెబ్బలు తగిలించుకుంటుంటారు. అలాంటప్పుడు సహజంగా మనం చూసేది తలకు బొప్పి కట్టడం. ఆలా బొప్పి కట్టినప్పుడు వెంటనే మనం ఏమి చేయాలి?

కంగారు పడకండా వెంటనే ఈ 3 స్టెప్స్ పాటించండి

1. బొప్పి తగ్గడానికి కొన్ని ఐస్ గడ్డలను ఒక పల్చటి గుడ్డలో లేదా డైపర్ లో అయినా తీసుకొని బొప్పి మీద 2-3 నిముషాలు పెట్టండి.

2. ఒకవేళ బొప్పి కొంచెం పెద్దగా ఉండి చిన్నారి ఇబ్బంది పడుతూ ఉంటె డాక్టర్ సలహా మేరకు acetaminophen లేదా ibuprofen ఇవ్వండి.

3. మూడవది, పిల్లాడి తలను కొంచెం పైకి ఎత్తడం. ఇలా చేయడం ద్వారా రక్తం బొప్పి కట్టిన ప్రదేశానికి వెళ్ళి గూడు కట్టకుండా ఉంటుంది.

ఈ 3 స్టెప్స్ పాటించిన తరువాత మీరు చేయాల్సిన మరికొన్ని పనులు

1. మీ చిన్నారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందేమో గమనించండి. మాములుగా ఏడవడం సహజమే కానీ వారిని ఒక వారం వరకు గమనిస్తూ ఉండడం మంచిది. మాటల్లో కానీ నడకలో కానీ ఏమైనా మార్పు వచ్చిందో చూడండి.

2. కొన్ని సార్లు తలకు తగిలే గాయాల వలన సొట్ట ఏర్పడుతుంది. అలా జరిగితే మీరు పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఇంకా నడవడం మొదలు పెట్టని పిల్లల్లో వాంతి లేదా వెక్కి వెక్కి ఏడవడం వంటివి చేస్తున్నారేమో చూడండి.

3. గాయం అయిన తరువాత నిద్రపోతే అది సహజమే. కానీ నిద్రకు సృహ తప్పిపోవడానికి తేడా తెలుసుకొని వ్యవహరించండి. ఒక వేల సృహ తప్పారు అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి.

ప్రమాదం జరిగిందని ఎప్పుడు అనుకోవాలి?

ఈ కింది లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి

1. సృహ కోల్పోవడం

2. రక్తం వస్తూనే ఉండటం

3. స్పందన లేకపోవడం

4. అపస్మారక స్థితి

5. ఎక్కువ సేపు ఏడుస్తూ  లేదా అరుస్తూ ఉండటం 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon