Link copied!
Sign in / Sign up
6
Shares

పసి పిల్లల ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితం. వాటిని శుభ్రపరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇక్కడ మీ పిల్లల ఆరోగ్యం గురించే చెబుతున్నాం కాబట్టి, చాలా జాగ్రత్తగా తెలుసుకోండి మరియు మీ పిల్లల చర్మం  ఎంతో సున్నితమైనదని గుర్తించండి. పసి పిల్లల ప్రైవేట్ పార్ట్స్ అంటే తొడల ముందు భాగం, వెనుక భాగం మరియు చంకలను ఎలా శుభ్రపరచాలి అనేది ప్రతి తల్లి తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.  మీరు తెలుసుకున్న తర్వాత అందరికీ చేరేలా SHARE చేయగలరు…

మీ పిల్లల మల, మూత్ర విసర్జన తర్వాత..

పసి వయస్సు పిల్లలు చాలా వరకు మల, మూత్ర విసర్జన తమ లోదుస్తులు (నాప్కిన్) లలోనే చేస్తుంటారు. అందుకని ప్రతిసారి మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. మల, మూత్ర విసర్జన అయిన తర్వాత ఆ భాగాలను అలాగే వదిలివేయకుండా గోరు వెచ్చని నీటితో కడిగి, పొడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. అస్సలు తడిదనం అనేది ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే అక్కడి బాక్టీరియా ఏర్పడి ఇన్ఫెక్షన్ మరియు చర్మ వ్యాధులకు కారణమవుతుంది.

ఎలా తుడవాలి..!!

స్నానం చేయించిన తర్వాత అయినా గానీ మూత్ర విసర్జన అయ్యాక అయినా సరే ఎప్పుడు చర్మంపై గట్టిగా, బలవంతంగా తుడవడం చేయకూడదు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన చర్మం పగిలి మంట, దురద కలిగి రక్తం వచ్చే ప్రమాదం ఉంది. బాగా తడి ఆరిన తర్వాత చెమట వేయకుండా బేబీ పౌడర్లు ఉపయోగించడం మంచిదే..

అబ్బాయిల పార్ట్స్ ఎలా క్లీన్ చేయాలి?

నిజానికి వినడానికి, చదవడానికి ఎలా ఉన్నా..ఇది చాలా ముఖ్యమైన విషయం. చిన్న పిల్లల పార్ట్స్ పై ఎక్కువ బాక్టీరియా ఏర్పడి ఉంటుందని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. స్నానం చేయించేటప్పుడు సుతిమెత్తగా పై చర్మాన్ని కాస్త ముందుకు లాగి శుభ్రం చేస్తే అక్కడ బాక్టీరియా ఉన్నా నాశనం అవుతుంది. అలాగే తొడల వెనుక భాగంలో కూడా ఎటువంటి క్రీములు రాయకండి..

అలాగే మీ పిల్లలకు స్నానం చేయించేటప్పుడు వైద్యులు ఏవైనా ప్రత్యేక సబ్బులు లేదా స్నానం నీటిలో కలపవలసిన స్కిన్ కేర్ ఆయిల్స్ ఉంటే కలుపవచ్చు. ఇవి ఏమీ ప్రమాదం కాదు. కానీ వైద్యులను అడిగి చేయడం ఉత్తమం. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ SHARE చేయగలరు.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon