Link copied!
Sign in / Sign up
5
Shares

పసి పిల్లల పొడి చర్మాన్ని (Dry Skin) నివారించడానికి 5 చిట్కాలు

పసి పిల్లల చర్మం అతి సులువుగా పొడిబారిపోతుంది. వర్షా కాలం, చలి కాలంలో ఇది మరీ ఎక్కువ.  అసలే సున్నితమైన చర్మం కావున వారి చర్మం పొదినారాకుండా, మృదువుగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఎలా? మార్కెట్లో దొరికే క్రీములు వాడడం మంచిదా? ఇలా ఎన్నో సందేహాలు మనకు రాక మానవు. అందుకే మీ కోసం ఈ ఆర్టికల్ రాయడం జరిగింది.

ఇంట్లోనే సహజ పద్దతిలో పిల్లల చర్మం పొడి బారకుండా ఉండడానికి ఈ 5 చిట్కాలు చదవండి. వీటిని పాటిస్తే పిల్లల చర్మం ఎప్పుడూ ఆరోగ్యాంగా మృదువుగా ఉంటుంది.

1. స్నానం చేయించే సమయం తగ్గించండి

చిన్న పిల్లలకు ఎక్కువ సేపు స్నానం చేయించ రాదు ఎందుకంటే పెద్దల చర్మం లాగా పిల్లల చర్మం ఎక్కువ సేపు నీటిని తట్టుకోలేదు. సహజంగా శరీరం ఉత్పత్తి చేసే నూనె ఎక్కువ సేపు నీటిలో ఉండడం వలన తొలిగి పోయి చర్మం పొడిబారిపోతుంది. కాబట్టి, పిల్లలకు 10 నిముషాలకు మించి స్నానం చేయించ రాదు.

2. తగిన నీరు తాగించండి

తప్పనిసరిగా పిల్లలు సరిపడా నీళ్లు తాగేలా చూసుకోoడి. నీరు చర్మానికి మాత్రమే కాదు మొత్తం శరీరం బాగా పని చేయడానికి కూడా అవసరం. పిల్లలే కాదు పెద్దలు కూడా తగినన్ని నీరు తాగడం అత్యంత అవసరం.

3. చర్మం లో తడి ఆరనివ్వకండి

పొడి చర్మం మరియు చిరాకు నివారించడానికి పిల్లల ఒంటిని ఎల్లపుడూ శుభ్రంగా, తడిగా ఉంచడం అత్యంత అవసరం. స్నానం చేయించిన తరువాత తప్పకుండా మాయిశ్చరైజర్ చేతులకు కాళ్లకు పూయండి. మంచి బ్రాండ్ మాయిశ్చరైజర్ వాడవచ్చు. ఇది పిల్లల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

4. కుదిరితే ఎండలో అస్సలు తిప్పకండి

ఎండలోకి పిల్లలను తీసుకొని వెళ్తే శరీరం మీద ఎండ పడకుండా ఉండేలా బట్టలు వేయండి. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు పిల్లల చర్మానికి అంత మంచిది కాదు. చర్మం పొడిగా మారడానికి సూర్య కిరణాలూ కూడా ఒక కారణం.

5. పిల్లలకు ప్రత్యేకమైన వస్తువులు వాడండి

పెద్దలకు వాడే సోపులు, షాంపూలను పిల్లలకు వాడకండి. పిల్లల చర్మం చాలా సున్నితమైనది కనుక కఠినమైన వస్తువులను వాడకపోవడం మంచిది. ఎక్కువ కెమికల్స్ లేని కుదిరితే అసలు కెమికల్స్ ఏ లేనివి వాడటం మంచిది. ప్రొడక్ట్స్ కొనుక్కునే ముందు బాగా పరిశీలించి కొనుక్కోండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon