Link copied!
Sign in / Sign up
73
Shares

పసి పిల్లల కన్నీటికి కారణం తెలుసుకోవడం ఎలా? పిల్లల ఏడుపు 5 రకాలు, 5 కారణాలు

పసి పిల్లలు మాటలతో అప్పుడే చెప్పలేరు, కానీ వాళ్ళు చెప్పాలనుకునేది ఏడుపు ద్వారా చెప్తారు. పసి పిల్లలకు భాష చాల చిన్నది.  సంతోషమైతే నవ్వు, బాధ ఇబ్బంది అయితే ఏడుపు ఇదే వారి భాష. కానీ, భాధ ఎందువలన కలుగుతోంది అనే కారణం చెప్పలేరు కాబట్టి తల్లిదండ్రులు గుర్తించగల్గాలి. బాగా గమనించిన తరువాత ఒక విషయం తెలిసింది, అదేంటంటే పిల్లల 5 రకాలుగా ఏడుస్తారు, అంటే 5 కారణాలతో ఏడుస్తారు. కారణాలు తెలుసుకుంటే పిల్లల ఏడుపు ఆపడం సులువవుతుంది. అంతే కాకుండా వారి అవసరం తెల్సుకొని తీర్చడం ద్వారా మనము కూడా సంతోషంగా ఉంటాము.  ఇప్పుడు వారి ఏడుపుకు కారణాలు ఏమిటో తెలుసుకుందాము.

1. నాకు ఆకలిగా ఉంది

ఎప్పుడైనా పిల్లలు లయబద్దంగా, మళ్ళి మళ్ళీ ఏడుస్తూ, బొటన వేలు నోట్లో పెట్టుకుంటే ఆకలితో ఏడుస్తున్నారని అర్థం. దీనిని వెంటనే గుర్తించి వారి ఆకలి తీర్చాలి, లేకపోతే ఏడుస్తూ గాలిని మింగితే పిల్లలు ఇంకా ఇబ్బందికి గురవుతారు.

2. నేను గాయపడ్డాను (I’m Hurt)

గట్టిగా, భయపడినట్టు పిల్లలు ఏడుస్తున్నారంటే వాళ్ళకి గాయం అయ్యిందని లేదా ఎక్కడో ఇరుక్కుపోయారని అర్థం. ఇలాంటి ఏడుపు వినిపిస్తే వెంటనే వెళ్లి ఎక్కడ ఇరుక్కున్నారో చుడండి, ఒకవేళ దెబ్బ తగిలితే ప్రథమ చికిత్స చేసి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. చిన్న గాయం అయితే పిల్లలను ఓదార్చడం అమ్మకంటే అంటే మీకంటే ఎవరికీ బాగా తెలుసు చెప్పండి. బుజ్జాయిని బుజ్జగించి బజ్జోపెట్టండి.

3. నాకు నిద్రొస్తోంది

నాకు నిద్రొస్తోంది అని చెప్పడానికి పిల్లలు చిన్నగా ఏడుస్తూ దొర్లుతూ ఉంటారు. పిల్లలని ఎవరు ఎత్తుకున్న వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటే బాగా నిద్ర వస్తోందని అర్థం. నిజం చెప్పాలంటే పిల్లలు నిద్ర వస్తోందని చెప్పా విధానము, నిద్ర పోయాక వారి అమాయకమైన ముఖం ఎంత బాగుంటుందో కదా. అలా ముద్దుగా ఏడుస్తునప్పుడు వారిని చేతుల్లోకి తీసుకొని ప్రశాంతమైన రూముకి తీసుకునేళ్తే చాలు వాళ్ళే హాయిగా నిద్రపోతారు.

4. నాకు ఆరోగ్యం బాగాలేదు

పిల్లలకు అనారోగ్యాంగా ఉంటె వారి ఏడుపు గుర్రు గుర్రు మని ఉంటుంది. అనారోగ్యంతో ఏడ్చే ఏడుపుకి గాయం ఏడుపుకి తేడా కనుక్కోవడం చాలా కష్టం. దీర్ఘాంగా పిల్లలను గమనిస్తే కనుకోవచ్చు. ఈ రెండు ఏడుపులకి ఒక పెద్ద తేడా ఏమిటంటే అనారోగ్యంతో ఏడ్చే అప్పుడు పిల్లల ముఖం కొంచెం ఎర్రగా మారుతుంది. శరీరం వేడిగా ఉన్న అనారోగ్యం అని సందేహపడొచ్చు.

5. నేను అలసిపోయాను

పిల్లలు అలసిపోయుంటే మీరు నవ్వించినా నవ్వరు. చేతులు ముఖం మీద పెట్టుకోవడం, కళ్ళు రుద్దుకోవడం వంటివి చేస్తుంటారు. నిద్ర వస్తుంటే కూడా కళ్ళు రూదుకుంటారు కానీ అలసటగా ఉంటె చిరాకుగా చేతిని ముఖం మీద నుండి నెట్టేస్తున్నట్టు చేస్తారు పాకే వయస్సు పిల్లలు అయితే దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో పిల్లలని ఎవరు ఎత్తుకోనివ్వకుండా వారికి ఒక బొమ్మ ఇచ్చి కాసేపు వదలడo మంచిది.

పిల్లలు ఎక్కువగా ఏడుస్తార్రు ఎందుకంటే వాళ్ళ చెప్పాలనుకునింది చెప్పడానికి అది ఒక్కటే మార్గము కనుక. మీరు పిల్లల ఏడుపుకి వెంటనే కారణం కనుక్కోలేకపోవచ్చు, కానీ కొన్ని రోజుల్లో అన్ని అర్థమైపోతాయి. అయినా పిల్లలు ఏడుస్తున్నారని బాధపడకండి, ఎందుకంటే పిల్లలకి ఏడుపే వ్యాయామం.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon