Link copied!
Sign in / Sign up
5
Shares

పసి బిడ్డల ఏడుపుకు 7 కారణాలు : అవేంటో తెలుసుకోండి…

బిడ్డలను కలిగివుండడం ఒక వరం. పసి బిడ్డల బోసి నవ్వులు వారు చేసే ముద్దు ముద్దు పనులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టె  విషయం ఏంటంటే వారి ఏడుపు. పసి బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియకపోవడం. ఆ ఏడుపును ఆపడానికి నానా తంటాలు పడడం. ఇవన్నీ కొత్తగా తల్లి ఆయిన్ ప్రతి మహిళ ఎదురుకునే సమస్యే. దీనికి పరిష్కారం మీ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోవడం. పసి బిడ్డల ఏడుపుకు కారణాలు ఏంటో ఇక్కడ చూడండి…

1. స్పర్శ కోసం

9 నెలలు మీ కడుపులో ఉండి బయటకు వచ్చాక, ఇక్కడి చలి, వేడి, వాతావరణంలోని మార్పు మీ బిడ్డకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. అప్పుడు మీ బిడ్డ మీ నుండి కోరుకునేది మీ స్పర్శను. మీ స్పర్శ తనను తాకే వరకు ఏడుస్తూనే ఉండచ్చు. మీ బిడ్డ ఏడుపుకు ఇది ఒక కారణం కావచ్చు.

2. ఆకలి

పసి బిడ్డల ఏడుపుకు మరోక కారణం వారి ఆకలి. కానీ ఏడ్చిన ప్రతి సారి అదే కారణం కాకపోవచ్చు. మీ బిడ్డకు ఎంత సమయం తేడాలో పాలు ఇస్తున్నారో గుర్తించుకోండి. ఆ సమయాలలో ఏడిస్తే దానికి ఆకలి కారణమని అర్ధం.

3. కడుపు నొప్పి

పసి బిడ్డలలో చాలా సాధారణంగా కడుపు నొప్పి వస్తుంది. పాలు సరిగా అరగకపోవడం, అవసరానికి మించి పాలు తప్పించడం ఇందుకు కారణాలు కావచ్చు. అందుకే పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు వారి కడుపును తాకి చూడండి. గట్టిగా ఉంటే కడుపు నొప్పి అయ్యుండే అవకాశం ఉండచ్చు.

4. పక్క తడపడం

డైపర్ తడిచినప్పుడు చల్లదనానికి తట్టుకోలేక ఏడుస్తారు. అందుకు పిల్లల పక్కను తరచూ చెక్ చేస్తూ ఉండండి. డైపర్ తడిస్తే వెంటనే మార్చేయండి. లేకపోతే అది ర్యాషెస్ కు దారి తీయచ్చు.

5. ర్యాషెస్

డైపర్ వలన పసి బిడ్డలలో ర్యాషెస్ ఏర్పడవచ్చు. అవి మంట కలిగినప్పుడు పిల్లలు తీవ్రంగా ఏడుస్తారు. పిల్లల ఏడుపుకు అది కూడా ఒక కారణం కావచ్చు. అందుకే పిల్లలలో ర్యాషెస్ రాకుండా చూసుకోండి. ఒకవేళ వస్తే వెంటనే ర్యాషెస్ పోగొట్టేందుకు చర్యలు తీసుకోండి.

6. మీరు కనపడక పోయినా

పసి బిడ్డలు ముందుగా తమ తల్లిని గుర్తుంచుకుంటారు. తమ తల్లి పక్కన ఉంటే సేఫ్ గా ఫీల్ అవుతారు. ఎక్కువ సమయం సేపు తల్లి కనిపించకపోతే కంగారు పడి ఏడుస్తారు. మీరు ఏ పనిలో వున్నా కాసేపు మీ బిడ్డకు కనిపిస్తూ ఉండండి.

7. నెమ్ము

పసి బిడ్డలకు నెమ్ము చేసినపుడు ఏడుస్తారు. ముందుగా బిడ్డలకు నెమ్ము చేయకుండా చూసుకోండి. ఒకవేళ చేసిన అది తగ్గేందుకు తగిన చర్యలు తీసుకోండి. పసి బిడ్డల ఏడుపుకు ఇది ఒక కారణం కావచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon