Link copied!
Sign in / Sign up
7
Shares

పిల్లల కోసం తల్లి తండ్రులు చేయకూడని 5 పనులు

పిల్లలకు కావాల్సినవన్నీ సమకూర్చడం తల్లి తండ్రులుగా మన బాధ్యత. వారు జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి తల్లి తండ్రులుగా చేయాల్సిందంతా చేస్తాం. వారి ప్రతి కోరికను నెరవేరుస్తాం, వారు అడిగిన ప్రతి దానిని కాదనకుండా తీసేస్తాం, వారి ఎదుగుదలలో ప్రతి మెట్టులో వారికి మన తోడ్పాటును అందిస్తాం. కానీ ఇదంతా ప్రతిసారి వారికి సహపడదు, కొన్ని సందర్భాల్లో వారికి మీరు సహాయం చేయకపోవడమే మంచిది. వారంతా వారుగా కొన్ని సమస్యలను ఎదురుకోవాలి, అది జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని అందిస్తుంది. అందుకే మీరు పిల్లల కోసం కొన్ని పనులను చేయకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. అడిగింది మిమ్మల్ని కాదు

మీరు మీ పిల్లలను తీసుకుని ఎక్కడికైనా వెళ్తున్నప్పుడో లేదా ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు ఎదురు పడి, మీ బాబు లేదా పాపను ముద్దు చేసి “నీ పేరేంటమ్మా “ అని అడిగారనుకోండి.. మీరు వెంటనే స్పందించి ఆ పేరు కాస్త మీరు చెప్పకండి. వారు అడిగింది మిమ్మల్ని కాదు. పిల్లలను అడిగిన ప్రశ్నలకు సమాధానాలను వారినే చెప్పనివ్వడం వలన బయట వారితో ఎలా మాట్లాడాలో వారు నేర్చుకుంటారు. ఆ అవకాశాన్ని వారికివ్వండి.

2. ఫ్రెండ్షిప్ వద్దు

కొంత మంది పిల్లలకు తల్లి తండ్రుల కాకుండా వారికి స్నేహితులుగా మెలగాలనుకుంటారు. అలా పిల్లలతో స్నేహంగా ఉండడం మంచిదే కానీ, మరి ఎక్కువ చనువు ఇవ్వడం అంత మంచిది కాదు. తల్లి తండ్రులు పిల్లలకు తల్లి తండ్రులుగానే ఉంటు వారికి కావాల్సిన ప్రేమను, స్నేహాన్ని అందివ్వండి.

3. కోరికలు, అవసరాలు

తల్లి తండ్రులుగా పిల్లలకు కావాల్సినవన్నీ తీసివ్వడం మన బాధ్యతగా భావిస్తాం. కానీ పిల్లలకు కావాల్సిన వాటిని రెండు విధాలుగా చూడాలి, కోరికలు అవసరాలు. పిల్లల అవసరాలను తప్పకుండా తీర్చాలి. కానీ కోరికల దగ్గర కొంచెం కటువుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రతి దానిని అందివ్వడం వలన తాము కోరుకున్న ప్రతిది జరిగి తీరాలనే మనస్తత్వం ఏర్పడిపోతుంది.

4. అన్నిట్లో సహపడకండి

సహపడడం, నేర్పించడం రెండు భిన్నమైన విషయాలు. మీ బాబుకు తనకు తానుగా ప్యాంట్ వేసుకోవడం రాదనుకోండి, మీరు ప్రతిసారి అందుకు సహాయం చేస్తే, తను ప్రతిసారి మీ సహాయాన్ని కోరుకుంటాడు. మీరు చేయాల్సింది తనకు తానుగా ప్యాంట్ వేసుకోనివ్వడం, ఆ సమయంలో మీరు పక్కన వుంది తప్పు చేస్తుంటే సహాయపడడం.

5. తనకు నచ్చింది

మీరు ఎప్పుడైనా సరదాగా షాపింగ్ కాని లేదా ఎక్కడికైనా తినడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు.  మీకు నచ్చిన కలర్ బట్టలు తీసుకోమని లేదా ఇలాంటి ఆహరం తినమని వారిని బలవంతం చేయకండి. వారికి నచ్చిన వాటిని వారినే ఎంచుకోనివ్వండి. అది వారికి కంటూ సొంత అభిప్రాయాల నిర్మాణానికి సహాపడుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon