Link copied!
Sign in / Sign up
73
Shares

ఇద్దరు పిల్లలతో వేగడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు…

ఓ అమ్మాయి తను పుట్టినప్పటి నుంచి తన జీవితంలో జరిగే అన్ని పరిణామాలకు అనుగుణంగా మారిపోవాల్సిందే. బిడ్డగా, ప్రేయసిగా, భార్యగా, చివరకు తల్లిగా కూడా ఉన్నప్పుడు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

ముఖ్యంగా తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించే మహిళ రోజు వారి లైఫ్ లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఒక బిడ్డ పుట్టినప్పుడే తన నిద్రను, తిండిని, మిగితా వాటిన్నంటినీ ఆ బిడ్డ కోసం తల్లి త్యాగం చేయాల్సిందే. మరి.. ఒక బిడ్డకే అలా అంటే.. ఇద్దరు పిల్లలను ఓ తల్లి ఎలా మేనేజ్ చేయాలి. వాళ్లను కంట్రోల్ చేయడమంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఇటువంటి సమయాల్లోనే తల్లి సంయమనం పాటించి.. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే.. ఇద్దరు కాదు కదా... ఎంతమంది పిల్లలనయినా.. ఇట్టే కంట్రోల్ చేయొచ్చే. మరి అవేంటో తెలుసుకుందామా...

రొటిన్ ప్లాన్ వేసుకోండి

 

మీ పిల్లలతో కలిసి కూర్చొని ఓ రొటిన్ ప్లాన్ ను అమలు చేయండి. వాళ్లు లేచినప్పటినుంచి రాత్రి పడుకునే దాక.. ఒకే విధమైన టైమ్ టేబుల్ ను ప్రతి రోజు అమలు చేయండి. దీని వల్ల అన్ని పనులు సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక తల్లిగా మీ పిల్లలకు ఒక సిస్టమాటిక్ లైఫ్ ను అలవాటు చేయడం బాధ్యతగా భావించండి. దీంతో మీకు వాళ్లను సరిగా పెంచినట్టూ ఉంటుంది.. వాళ్లు కూడా సరైన దిశలోనే పెరుగుతున్నట్టూ ఉంటుంది. ఒకసారి వాళ్లు సిస్టమాటిక్ లైఫ్ కు అలవాటు పడితే... మీ జోక్యం లేకుండానే వాళ్లే దాని ప్రకారమే నడుచుకుంటారు. దీంతో మీపై భారం కూడా తగ్గుతుంది. ఏమంటారు.

క్యాలెండర్ రూపొందించండి

ఇద్దరు పిల్లలంటే ఖచ్చితంగా చాలా పనులు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అటువంటివన్నీ గుర్తు పెట్టుకోవడానికి ఓ క్యాలెండర్ ను రూపొందించుకోండి. అంటే.. ఓ రిమైండర్ లాగా అన్నమాట. లేదంటే గూగుల్ క్యాలెండర్ అయినా పర్లేదు. ఆ సంవత్సరంలో చేయాల్సిన ముఖ్యమైన రోజులను రిమైండ్ చేసి పెట్టుకుంటే గనుక.. మీ బాధ సగం తీరినట్లే. ఆ ముఖ్యమైన రోజును మీరు గుర్తుపెట్టుకోకున్నా.. ఆ రోజు రాగానే క్యాలెండరే మీకు గుర్తు చేస్తుంది.

పిల్లలనూ ఇన్వాల్వ్ చేయండి

ఒక వయసు వచ్చే వరకు ఓకే కాని.. పిల్లలు తమతంట తాము పని చేసుకొనే వయసు వచ్చారంటే.. వాళ్లకు కొన్ని పనులు అప్పగించాలి. అన్ని పనులు కాకున్నా.. వాళ్లు చేయగలిగే పనులు లాంటివి.. తినడం, స్నానం చేయడం, చిన్న చిన్న సాయం చేయడం లాంటివి వాళ్లే చేసుకునేలా అలవాటు చేయాలి. వాళ్లకు వాళ్లు ఆ పనులు చేసుకోవడం వల్ల వాళ్లకు అలవాటు అవుతుంది.. దాంతో పాటు మీకు కూడా శ్రమ తగ్గుతుంది. ఆ సమయంలో ఓ తల్లిగా మీరు వేరే పని చూసుకోవచ్చు.

ఫ్యామిలీ టైమ్

భార్యాభర్తలిద్దరూ పని చేసేవాళ్లయినప్పుడు ఈ ఫ్యామిలీ టైమ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇద్దరు పనికి వెళ్లేవాళ్లయితే.. పిల్లలతో చాలా తక్కువ సమయం గడుపుతారు. ఇది పిల్లలకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకే.. రోజులో కొంత సమయంగాని.. లేదంటే.. వారంలో ఒక రోజు కాని.. పిల్లల కోసమే కేటాయించండి. దీంతో తల్లిదండ్రలకు, పిల్లలకు మధ్య బాండింగ్ పెరుగుతుంది. దీంతో పిల్లలు కూడా ఎంతో హుషారుగా, చురుకుగా, బెరుకు లేకుండా ఉంటారు.

నెసెసిటీ కిట్

కొన్ని పనులు కావాలంటే నెసెసిటీ కిట్ అవసరం ఎంతో ఉంటుంది. నెసెసిటీ కిట్ అంటే పిల్లలకు అత్యవసరమైన వస్తువుల జాబితా అన్నమాట. అంటే.. మంచినీళ్లు, ఆహారం, టిష్యులు, వైపర్స్, బట్టలు, మెడిసిన్.. ఇలా పిల్లలకు అవసరమైన కిట్ ఎప్పుడూ తల్లితో పాటు ఉండాలి. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడైతే ఈ కిట్ చాలా ముఖ్యం. ఇవన్నీ లేకుండా పిల్లలను మాత్రం ఎక్కడికీ తీసుకెళ్లకండి.

పిల్లల హెల్ప్ తీసుకోండి

ఇది చాలా మంచి ఐడియా. ఒక తల్లిగా, తండ్రిగా ఇంట్లో అన్ని పనులు మీరే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మీ పిల్లలకు కూడా కొన్ని పనులు అప్పజెప్పండి. అంటే.. వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడంతో పాటు.. మరి కొన్ని మీరు చేయాల్సిన పనులను కూడా వాళ్లకు అప్పగించండి. దీని వల్ల పిల్లలకు బాధ్యత పెరిగి.. పనుల ప్రాముఖ్యత తెలుస్తుంది.

బయటికి తీసుకెళ్లండి

ఒక్కోసారి పిల్లలతో గడిపే అవకాశం ఇంట్లో లేనప్పుడు వాళ్లను అలా సరదాగా బయటికి తీసుకెళ్లండి. మీకు వీలు కుదరకున్నా.. ఎప్పుడూ ఇంట్లనే ఉంటే పిల్లలు బోర్ ఫీల్ అవుతారు. అందుకే సమయం కల్పించుకొని కాసేపు అలా పార్క్, లేదంటే ఏదైనా కొత్త ప్లేస్ కు తీసుకెళ్లండి. వాళ్లతో పాటు మీరు కూడా రిలాక్స్ అవడానికి అవకాశం ఉంటుంది.

మీకూ కొంత సమయం కేటాయించుకోండి

ప్రతి రోజు పిల్లలతోనే గడుపుతూ ఉంటే మీకంటూ సమయం మిగలకుండా పోతుంది.  అందుకే మీకోసం కూడా కొంత సమయాన్ని కేటాయించండి. మీ భర్త కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. ఓ తల్లిగా మీరు మీ బాధ్యతను ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తారో.. ఓ భార్యగా కూడా అలాగే నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే మీ భర్త కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించండి. అలా అయితేనే... ఏ ఫ్యామిలీ అయినా.. మంచి జీవితాన్ని పొందుతుంది. లేదంటే.. ఏదో ఒక వెలితి ఉంటుంది. ఆ వెలితిని పూడ్చే బాధ్యత ఖచ్చితంగా తల్లిదే.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon