Link copied!
Sign in / Sign up
41
Shares

మీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తున్నారా..! అయితే ఇది చదవడం మీకు చాలా అవసరం..

నిండా 2 ఏళ్ళు కూడా నిండని చిన్నారి, అభం శుభం తెలియని ఓ బాలుడు..ఇలా సెల్ ఫోన్ ఛార్జర్స్ కారణంగా తమ ప్రాణాలను  పోగొట్టుకున్నారు. ఇలా కేవలం పిల్లలే కాదు ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పేలిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్న పెద్దవారు ఉన్నారు. ఐతే ఇక్కడ ఈ చిన్నారి ప్రాణాలు  కోల్పోవడానికి అసలు కారణం తెలిస్తే మీ నిర్లక్ష్యం ఏంటో తెలుస్తుంది.

ఛార్జర్ వైర్ నోట్లో పెట్టుకున్న చిన్నారి

నల్గొండ జిల్లాకు చెందిన ప్రవల్లిక అనే  చిన్నారి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ ఛార్జర్ ను నోట్లో పెట్టుకుంది. అది ఏంటో కూడా ఈ చిన్నారికి తెలియదు. ఏదో వస్తువు కనిపించింది కదా అని నోట్లో పెట్టుకుంది. ఆ సమయంలో ఛార్జర్ స్విచ్ ఆన్ చేసి ఉండటంతో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. తమ అజాగ్రత్త వల్లే పాప ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆ పాప తల్లితండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. అలాగే ఆ ఛార్జర్ కూడా నాసిరకం అయినది. మార్కెట్ లో తక్కువ ధరకు లభించే ఇటువంటి ఛార్జర్స్ వలనే చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తోంది..

అమ్మ పక్కనే ఉన్నా చూడలేకపోయింది

19 నెలల బాబు తను పడుకున్న బెడ్ పక్కనే ఉన్న సెల్ ఫోన్ ఛార్జర్ ఉండటంతో తన పక్కనే ఉన్న బొమ్మలతో ఆడుకుంటూ ఫోన్ ఛార్జర్ ను నోట్లో పెట్టుకోవడంతో నోటి భాగం మొత్తం చిట్లిపోయింది. ఈ చిన్నారి అమ్మ తన పక్కనే ఉన్న చూడలేకపోయింది. అప్పటివరకు ఫోన్ ఛార్జింగ్ ఉంచిన ఆ బాబు తల్లి/తండ్రి ఏదో ఫోన్ కాల్ రావడంతో ఫోన్ కు ఉన్న ఛార్జర్ వైర్ తీసివేసి వెళ్లిపోయారు. ఛార్జర్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. తన బాబుకు జరిగిన విధంగా ఇంకెవరికీ జరగకూడదని ఈ బాబు తల్లి సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. అందుకే దయచేసి పిల్లలు పెద్ద అయ్యేంత వరకు వారికి దగ్గరగా ఫోన్లను, సెల్ ఫోన్ ఛార్జర్ లను ఉంచకండి. ఎంత ప్రమాదకరమో చూశారు కదా..

ఇది కూడా చదవండి..

సెల్ ఫోన్ పిల్లల తలకు, చెవికి దగ్గరగా పెడితే నిజంగానే ప్రమాదమా..!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon