Link copied!
Sign in / Sign up
56
Shares

‘పానీ పూరి’ ఇంట్లోనే 15 నిముషాల్లో తయారు చేసుకునే విధానం

పానీ పూరి.. ఈ పేరు చెబుతుంటూనే నోరు ఊరుతోంది కదూ. మహిళలకు చాలా ఇష్టమైన పానీపూరి బయట ఫాస్ట్ ఫుడ్స్ దగ్గర తినాలనుకుంటారు. ఐతే అక్కడ చేసేవి బాగుండవు అని అందరూ చెబుతూ ఉండటం వలన పానీపూరి తినడానికి ఇష్టపడరు. అందుకని ఇక్కడ చెప్పుకుంటున్నట్లు ఇంట్లోనే పానీపూరీనిఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకోండి.

పూరీ ఎలా తయారుచేసుకోవాలి?

పానీపూరిలో పూరిని తయారుచేసుకోవడానికి ముందుగా అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుని, ఇందులో రెండు స్పూన్ల మైదాపిండి కలిపి కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కాస్త నీటిని కలుపుతూ మైదాపిండిని ముద్దగా అయ్యేలా చేసుకోవాలి. తడిగుడ్డ తీసుకుని మిక్స్ చేసుకున్న ముద్దను అందులో ఉంచాలి. ఆ తర్వాత చపాతీలు చేసుకున్నట్లు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మరుగుతున్న వేడి నూనెలో వేయాలి. దీంతో పానీపూరిలో పూరి రెడీ.

పానీపూరిలో ఇది తప్పనిసరి..!

పూరి మధ్యలో ఉంచే బంగాళాదుంప, శనగలు, పచ్చి బటానీలు తప్పనిసరి. ముందుగా రెండు బంగాళా దుంపలను, పచ్చి బఠాణీలను బాగా ఉడికించాలి. కావాలంటే శనగలు ఉడికించుకోవచ్చు (రుచి కొరకు). ఉడికిన బంగాళాదుంప పై తొక్క తీసివేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో కాస్త కారం, ఉప్పు, మసాలా పొడి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకుని ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

పానీ ఎలా తయారు చేసుకోవాలి?

ఇక పానీ విషయానికొస్తే కొంచెం కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, చిన్నగా తరిగిన మిరపకాయ ముక్కలు, ఇందులో నీటిని కలిపి మిక్స్ చేయాలి. దీంతో పానీ రెడీ అయినట్లే. ఇంకొంతమంది చింతపండు వేసుకుని పానీ చేసుకుంటూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు.  పూరీ తీసుకుని ఇందులో బంగాళాదుంపల మిశ్రమాన్ని మధ్యలో ఉంచి పానీలో ముంచుకుని తింటే సూపర్ గా ఉంది కదా అని అంటారు. చివరలో బూందీ కూడా కలుపుకోవచ్చు.  పానీ పూరి ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి.

Video credits : Divya Easy Kitchen

పానీ పూరి తయారీ విధానం మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon