Link copied!
Sign in / Sign up
1
Shares

పాలిచ్చే తల్లులు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పక తీసుకోవాల్సిన 5 ఆహారాలు

పిల్లలకు జన్మను ఇచ్చిన ప్రతి తల్లి బాధపడే ఒకే ఒక్క విషయం ఏమిటంటే బిడ్డకు ఆకలి తీర్చడానికి సరిపడా పాలు ఇవ్వలేకపోతున్నానని. ఎందుకంటే బిడ్డకు పాలు ఎంత అవసరమో తల్లికి తెలుసు కాబట్టి. ఇంకో విషయం ఏమిటంటే తల్లి తీసుకునే ఆహారమే బిడ్డకు కూడా అందుతుంది కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఈ ముఖ్యమైన ఆహారాలు ప్రతి తల్లి తీసుకోవడం వలన ఎక్కువ పాలు ఉత్పత్తి అవ్వడమే కాకుండా బిడ్డకు ఆరోగ్యకరం కూడా..

వెల్లుల్లి

వెల్లుల్లిని రోజులో రెండు లేదా మూడు రిబ్బలను తీసుకోవడం వలన పాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే సహజ గుణాల వలన బిడ్డకు ఆరోగ్యకరం మరియు రోగ నిరోధకశక్తిని పెరిగేలా చేస్తుంది. అలాగే శరీర వేడిని కంట్రోల్ లో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ ప్రక్రియ బాగా జరిగేలా ఉపయోగపడుతుంది మరియు ఎటువంటి వ్యాధులు సోకకుండా అడ్డుకోగల శక్తి ఉంది.

అల్లం

తల్లి పాలను సమృద్ధిగా ఉత్పత్తి చేయడంలో అల్లం మరో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి రోగ నిరోధకశక్తిగా పనిచేయడమే కాకుండా ఎటువంటి బాక్టీరియా శరీరంలో ప్రవేశించకుండా సహాయపడుతుంది. అలాగే ప్రసవం తర్వాత కొందరిలో అప్పుడప్పుడు బ్లీడింగ్ సమస్య ఉంటుంది కాబట్టి అల్లం తీసుకోవడం వలన మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాదు. గ్యాస్, ఎలర్జీ రాకుండా ఉపయోగపడుతుంది.

నెయ్యి

నెయ్యిని గర్భంతో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చా లేదా అని చాలామందికి ఉన్న అనుమానం. ఎటువంటి భయం లేకుండా నెయ్యిని గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. బరువు నియంత్రణలో ఉంచడమే కాకుండా పాల ఉత్పత్తి బాగా జరిగేలా చేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

దానిమ్మ

తల్లి పాలను సమృద్ధిగా ఉత్పత్తి చేయడంలో మేజర్ పాత్ర పోషించే మరో ఆహారం దానిమ్మ పండు. దీనిని జ్యూస్ గా లేదా గింజలుగా తీసుకోవచ్చు. దానిమ్మలో అధిక న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయగల గుణం ఇందులో కలదు. పాలిచ్చే తల్లులు వీటిని తప్పనిసరిగా తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.

మెంతులు
మన ఇంటి పెరట్లో, మన వంటింట్లో లభించే మెంతి ఆకులు లేదా మెంతులను తీసుకోవడం వలన పాల ఉత్పత్తి బాగా జరుగుతుందని మన పెద్దలు చాలా కాలం నుండే పాటిస్తున్నారు. వీటిలో ఉండే సహజ గుణాల కారణంగా జ్వరం, కీళ్ల నొప్పులను త్వరగా తగ్గించివేస్తుంది.

అలాగే ఓట్స్ ను కూడా తల్లి ఆహారంలో భాగం చేసుకోవడం వలన పాల ఉత్పత్తి బాగా జరిగి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందరికీ SHARE చేయగలరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon