Link copied!
Sign in / Sign up
12
Shares

పాలిచ్చే తల్లులు తప్పకుండా తినాల్సిన 6 పండ్లు

ప్రసవం తరువాత తల్లులు ఎక్కువగా ఆలోచించే విషయం, బిడ్డకు పాలు పట్టడం. మొదట కొంత సమయం తరువాత, కొన్ని తప్పుల తరువాత పిల్లలకు పాలు ఇవ్వడం అలవాటైపోతుంది. కానీ బిడ్డకు సరిపోయే పాలు మీ దగ్గర ఉండకపోవచ్చు. అందుకు మీరు చేయాల్సింది పౌష్టిక ఆహారం తీసుకోవడం. అందులో మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే పండ్లు ప్రధానమైనవి. మీరు బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే…

1. స్ట్రా బెర్రీస్

స్ట్రా బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులందరూ స్ట్రా బెర్రీస్ తినడం చాలా అవసరం. అవి మీ శరీరాన్ని హైడ్రేటడ్ గా ఉంచుతాయి.  మీ రొమ్ముల్లో పాల కొరతను రానివ్వవు.

2. సోపోటా

సోపోట లోని గ్లూకోస్ మీకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో, మీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఇందులో వుండే పీచు పదార్ధాలు మీ అరుగుదల బాగా జరిగేలా చేస్తాయి. దీని వలన మీరు తీసుకునే ఆహారాలలోని పోషకాలు మీ శరీరానికి అందుతాయి.

3. బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ అన్ని పండ్లలోకంటే ఎక్కువ యాంటీఆక్సిడాంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మీ రొమ్ములలో పాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇప్పుడు అన్ని సూపర్ మర్కెట్స్ లో బ్లూ బెర్రీస్ దొరుకున్తున్నాయి. వాటిని తినడానికి ప్రయత్నించండి.

4. అరటి పండ్లు

అరటి పండ్లలో ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో, మీ శరీరంలోని ఎలెక్ట్రోలైట్, ద్రవాల స్థాయులను సమతుల్యంగా ఉంచడానికి పొటాషియం చాలా అవసరం. అందుకే మీ ఆహారంలో అరటి పండ్లను తప్పక చేర్చుకోండి.

5. బొప్పాయి

బొప్పాయిలో ఉండే గాలాక్టోగోగ్ (galactagogue) అనే పదార్ధం, రొమ్ములలో పాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్స్ మీకు చాలా అవసరం.

6. అవకాడో

అవకాడో పండ్లలో ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఈ అమైనో ఆసిడ్స్ మీ పాల ఉత్పత్తికి సహాయపడడమే కాకుండా బిడ్డను ఆరోగ్యాంగా ఉంచుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon